దేశ వ్యాప్తంగా పూణె ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఓ బాలుడు మద్యం సేవించి వేగంగా కారు నడిపి ఇద్దరు టెకీల ప్రాణాలను బలి తీసుకున్న ఘటనను ఇంకా మరువక ముందే మరో ఘోరం జరిగింది.
Bird Flu: ఏవియన్ ఇన్ఫ్లుఎంజా విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం శుక్రవారం అన్ని రాష్ట్రాలను కోరింది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజాను బర్డ్ ఫ్లూ అని కూడా అంటారు.
రాజేంద్రనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. సన్ సిటీ వద్ద 270 గ్రాముల (MDMA) డ్రగ్స్ పట్టుకుని సీజ్ చేశారు. ఓ యువకుడి తో పాటు మహిళను అరెస్ట్ చేశారు. సన్ సిటీ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశకు ఇంకా ఓటింగ్ జరగాల్సి ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో ఎన్డీయే కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన డంపర్ ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన ఈరోజు (సోమవారం) ఉదయం జరిగింది.
ఎంఐఎం పార్టీ నేతపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ పెట్రోల్ పంపు సమీపంలో మాలెగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై కాల్పులకు పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీకి మాలిక్ ప్రముఖ నాయకుడిగా ఉన్నారు.
Pune Car Accident Case: పూణేలో మైనర్ వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరు టెక్కీల మరణానికి కారణమయ్యాడు. పోర్ష్ కారుతో బైకును ఢీకొట్టడంతో 24 ఏళ్ల అనీష్ అవధియా, 21 ఏళ్ల అశ్విని కోష్ట మృతి చెందారు.
ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తనపై దాడి చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్‌పై రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.