NTR Dragon: యూరప్‌లో కాదు.. ఆర్ఎఫ్సిలో యాక్షన్ రచ్చ! ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం భారీ సెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Dragon: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా యూరప్ ని తలపించే భారీ సెట్‌ను నిర్మించింది. ఈ ప్రత్యేక సెట్లో ఎన్టీఆర్‌పై హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. సినిమాకు కీలకంగా నిలిచే ఈ యాక్షన్ సన్నివేశాల కోసం భారీ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యూరప్‌లో చిత్రీకరించినట్లే కనిపించేలా సెట్ డిజైన్ చేయడం ద్వారా ప్రేక్షకులకు కొత్త విజువల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ సినిమాలకు యాక్షన్ సన్నివేశాలే హైలెట్ గా నిలుస్తాయి. అదే తరహాలో ‘డ్రాగన్’లో కూడా కళ్ళు చెదిరే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో ఎన్టీఆర్ కీలక సన్నివేశాలను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో తొలిసారి జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కుదరడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, మరోవైపు ప్రశాంత్ నీల్ స్టైలిష్ మేకింగ్ కలిసి వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తాయో అన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా మంచి బజ్ ఏర్పడింది. భారీ నిర్మాణం, పవర్ఫుల్ యాక్షన్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో ‘డ్రాగన్’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత తదుపరి షూటింగ్ వివరాలను చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉంది.
Also Read
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!