బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన(ఏక్నాథ్ షిండే) అధికార కూటమి మొత్తం మహారాష్ట్రలోని 48 లోక్సభస స్థానాల్లో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలుచుకుంటి. 2019లో సొంతగా 23 ఎంపీ స్థానాలను సాధించిన బీజేపీ ఈ సారి 9 స్థానాలకే పరిమితమైంది.
Supriya Sule: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పగ్గాలు తన కజిన్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఇచ్చేందుకు పార్టీ సిద్ధమైనప్పటికీ ఆయన తమను వీడి వెళ్లారని ఎంపీ సుప్రీయా సూలే అన్నారు.
ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో నగరం అతలాకుతలం అయిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో అత్యంత భారీ వర్షం కురవడంతో జనాలకు చుక్కలు కనిపించాయి.
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. స్పైస్‌జెట్ మరియు విస్తారా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు ఎక్స్‌లో పేర్కొన్నాయి.
ఇదిలా ఉంటే, ఈ ఎన్‌కౌంటర్‌పై అక్షయ్ షిండే తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు బాంబే హైకోర్టు విచారించింది. మహారాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఈ ఎన్కౌంటర్ని నమ్మడం కష్టంగా ఉంది
Badlapur encounter: బద్లాపూర్ అత్యాచార నిందితుడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిందితుడిని వాహనంలో తీసుకెళ్తుండగా.. అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నీలేష్ మోర్ పిస్టల్ లాక్కుని ఎస్కార్ట్ పోలీసుల నుంచి పారిపోయిందుకు ప్రయత్నించాడని, ఈ నేపథ్యంలో ముగ్గురు పోలీసులకు కారణమయ్యాయని పోలీసులు వెల్లడించారు.
మహారాష్ట్ర పూణేలోని చర్హోలీ గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చనిపోయిన కొద్ది రోజులకు తిరిగి వచ్చాడు. చనిపోయిన వ్యక్తి ఎలా వచ్చాడు? అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం.. పూణేలోని చర్హోలీ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పొలంలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ మృతదేహం పొలాలు దున్నేందుకు ఉపయోగించే రోటావేటర్‌లో ఇరుక్కుపోయి ఛిద్రమైంది. మొండెం పైనుంచి తల కూడా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దుస్తులను గుర్తించగా మృతదేహం…
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏకనాథ్ షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ఏక్నాథ్ షిండే అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో పూణె విమానాశ్రయం పేరును మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పూణె విమానాశ్రయం పేరు మార్చారు. 'జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం'గా నిర్ణయించారు.