Maharashtra Elections: 99 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. అందులో ప్రముఖుల పేర్లు
- మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధం..
- అభ్యర్థుల తొలి లిస్ట్ రిలీజ్ చేసిన బీజేపీ..
- ఫస్ట్ లిస్ట్‌లోనే ఫడ్నవీస్‌తో పాటు మరికొందరు ప్రముఖులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. 99 మందితో తొలి లిస్ట్‌ని విడుదల చేసింది. ఫస్ట్ లిస్టులోనే డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్‌తో పాటు అశోక్ చవాన్ కూతురి పేర్లు ఉన్నాయి. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు కూటముల మధ్య పోరు నెలకొంది. అధికార బీజేపీ నేతృత్వంలో ‘‘మహాయుతి’’ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘‘మహావికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి మధ్య పోటీ ఉంది. మహాయుతిలో బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీలు ఉండగా, ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్- ఠాక్రే శివసేన- శరద్ పవార్ ఎన్సీపీ ఉన్నాయి. మొత్తం 288 సీట్లలో బీజేపీ 151లో పోటీ చేస్తోంది. మిగిలిన సీట్లను శివసేన, ఎన్సీపీలు పంచుకుంటాయి.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
Read Also: Pakistan : మా దగ్గర అన్ని రకాల అణు బాంబులు ఉన్నాయ్.. భారత్‌ను బెదిరించిన పాక్ అధికారి
మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2009 నుంచి ఫడ్నవీస్ ఇక్కడి నుంచే పోటీలో ఉన్నారు. నాగ్‌పూర్ బీజేపీకి కంచుకోటగా ఉంది. రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేకర్ బవాన్‌కులే నాగ్‌పూర్ జిల్లా కమ్తి నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర మంత్రి సుధీర్ మునిగంటివార్ బల్లార్‌పూర్ నుంచి పోటీ చేస్తుండగా, కేంద్రమంత్రి రావు సాహెబ్ దాన్వే కుమారుడు సంతోష్.. భోకర్దాన్ నుంచి బరిలోకి దిగారు. నాగ్‌పూర్ రీజియన్ బీజేపీకి కంచుకోటగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గెలుపొందారు.
భోకర్‌లో బిజెపి శ్రీజయ చవాన్‌ను పోటీకి దింపింది. ఈమె మాజీ మహారాష్ట్ర సీఎం అశోక్ చవాన్ కుమార్తె. లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారారు. కన్కావ్లీ నుంచి మాజీ కేంద్రమంత్రి నారాయణ్ రాణే కుమారుడు నితీస్ రాణే పోటీ చేస్తున్నారు. బీజేపీ తొలిజాబితాలో 13 మంది మహిళా అభ్యర్థులు.. ఎస్సీ వర్గానికి చెందిన నలుగురు, ఎస్టీ వర్గానికి చెందిన ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు.
BJP releases the first list of 99 candidates for the #MaharashtraElection2024. pic.twitter.com/GphO1vs5p0
— ANI (@ANI) October 20, 2024
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?