మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి -మహా వికాస్ అఘాడీ సర్కార్ చిక్కుల్లో పడింది. శివసేనకు చెందిన మంత్రి ఏక్నాథ్ షిండే 22 మంది ఎమ్మెల్యేలతో అజ్ఞానతంలోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో గల ఒక హోటల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేతో పాటు కొందరు ఎమ్మెల్యేలు తమకు అందుబాటులోకి రావడం లేదని శివసేన నేతలు కూడా అంగీకరిస్తున్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్…
మరోసారి మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఓ మంత్రి సహా దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లడం అధికార పార్టీకి షాక్ తగిలినట్టు కాగా.. సీఎం ఉద్ధవ్ ఠాక్కే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు
అమ్మ తిట్టిందనో.. పరీక్ష పాస్ అవ్వలేదనో … ఆర్థిక ఇబ్బందులో.. అక్రమ సంబంధాల వల్లో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇదే పరిస్థితి. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుని.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. దాంతో కన్నవాళ్లకు కడుపు కోత మిగులుతుంది. ఈ ఆత్మహత్యల వల్ల కొందరు పిల్లలను కోల్పోతుంటే.. మరికొందరు పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. చిన్న సమస్యలకు ప్రాణాలు తీసుకోవడం పరిపాటిగా మారింది.…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొననుండడం సంచలనంగా మారింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై అసంతృప్తితో మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే.. మరో 11 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్లో సూరత్‌కు వెళ్లినట్లు సమాచారం. తన వెంట 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏక్నాథ్ షిండే తెలిపినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. వీరంతా గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సూరత్‌లోని గ్రాండ్ భగవతీ హోటల్లో ఆ ఎమ్మెల్యేలు బస చేస్తున్నట్లు…
అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. జూన్ 3న విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది. 2011లో ముంబైలో జరిగిన పేలుళ్లలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాన్ని అడ్డుపెట్టిన పోరాట యోధుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ మూవీని శశికిరణ్ తిక్కా తెరకెక్కించాడు. ఈ…
శుక్రవారం నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహారాష్ట్రలో ఓటింగ్‌కు అర్హత సాధించిన మొత్తం 285 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగగా.. బీజేపీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టగా, శివసేన ఇద్దరు, కాంగ్రెస్, ఎన్సీపీ ఒక్కొక్కరు చొప్పున అభ్యర్థులను నిలబెట్టడంతో పోటీ అనివార్యమైంది. మొత్తం ఆరు స్థానాలకు గానూ ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ నుంచి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ గెలుపొందారు.…
నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక జరగనుంది. హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణకు ఈసీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న…
భారత్‌లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని నాలుగు రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో ఖతార్‌పేరుతో ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఈ మేరకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్‌ను, రోడ్డు నిర్మాణ ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఇంతటి గొప్ప పనిలో రాత్రి, పగలు భాగమైన ఇంజనీర్లు,…
మహారాష్ట్ర లో దారుణం జరిగింది. గడ్చిరోలి జిల్లాలో SRPF జవాన్ల మధ్యలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆవేశంతో సహఉద్యోగి పై తన రివాల్వర్ త్ కాల్చిచంపాడు. తరువాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘర్షణలో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. అహేరి తహసీల్ పరిధిలోని మర్పల్లి పోలీసు క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సబ్ డివిజనల్ పోలీసు అధికారి సుజిత్ కుమార్ క్షీరసాగర్ విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన…