Chandrababu Naidu Released TDP Manifesto In Mahanadu: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో నిర్వహించిన మహానాడు వేదికగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెస్తామని, ఇంట్లో ఎంతమంది మహిళలు అంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు. ‘తల్లికి వందనం’ పేరుతో ప్రతి బిడ్డ చదువుకునేందుకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సులల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు.
Crime News: దారుణం.. 12 ఏళ్ల చిన్నారిని తల్లిని చేసిన దుర్మార్గులు.. అంతా తల్లి తప్పే..?
యువగళం కింద ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని.. అలాగే యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చంద్రబాబు మాటిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లలు ఉండాలనే నిబంధనని ఎత్తివేస్తామని చెప్పారు. రైతు కోసం అన్నదాత కార్యక్రమం తెస్తామని చెప్పిన చంద్రబాబు.. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని, బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్ అందించి, ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో.. పేదలను ధనుకుల్ని చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. పూర్ టూ రిచ్ పేరుతో పథకం తీసుకొస్తానన్న ఆయన.. పేదోడ్ని ధనుకుడు చేయడమే తన సంకల్పమని ఉద్ఘాటించారు. పూర్తి స్థాయి మేనిఫెస్టోను దసరాకి ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Harish Rao: మోడీ చెప్పేవన్నీ ‘టీమ్ ఇండియా’.. చేసేవి ‘తోడో ఇండియా’
ఇది ఎన్టీఆర్ శకమని.. క్రీస్తు శకం తరహాలో ఎన్టీఆర్ శకం అని చెప్పుకునేలా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ అంటేనే సంక్షేమమని అన్నారు. టీడీపీ పేదల పార్టీ అని, అన్ని వర్గాలకు న్యాయం చేసిందని చెప్పారు. టీడీపీది ప్రజాబలమని, మనది విజన్ పాలిటిక్స్ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక.. అవినీతి డబ్బును పేదలకు పంచుతానన్నారు. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని చెప్పుకొచ్చారు.