Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి ఇప్పటి వరకు 62 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం చెప్పారు. నిర్దిష్ట కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ‘‘శతాబ్ధంలోనే అరుదైన సంఘటన’ ’గా అభివర్ణించారు. ఆగ్రాలో జరిగిన యూనికార్న్ కంపెనీ సమావేశంలో యోగి పాల్గొన్నారు.
భారత్ కు ఘనమైన సంస్కృతి, గర్వపడే ఆధ్యాత్మిక వారసత్వం ఉన్నాయని మహా కుంభమేళాతో మరోసారి రుజువైంది. మహా కుంభమేళాకు ఉత్సాహంగా పోటెత్తిన భక్తులు.. మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో మరోసారి విశ్వవ్యాప్తంగా భారత్ పేరు మార్మోగిపోయింది. అసలు ఆధ్యాత్మిక క్రతువు ఎలా జరగాలో మహాకుంభమేళా నిరూపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో ప్రతి ఘట్టం రికార్డులు సృష్టించి..
MahaKumbh Mela: ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా చివరి దశకు చేరుకుంది. జనవరి 13 నుంచి ప్రారంభమైన ఈ అద్భుత జన సంగమం ఫిబ్రవరి 26 శివరాత్రితో ముగుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ప్రపంచాన్ని ఆకర్షి్స్తోంది. కనీవిని ఎరుగని రీతిలో ప్రపంచనలుమూలల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కోట్లాదిమంది పవిత్రస్నానాలు ఆచరించారు. మరో నాలుగు రోజులలో మహాకుంభమేళా ముగియనుంది. అయితే ఈ సారి జరుగుతున్న కుంభమేలా 144 ఏళ్లకు వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో ఇందులో పాల్గొనాలని, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాలని చాలా మంది భావిస్తున్నారు. Also Read:Home Ministry:…
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా చివరి వారంలోకి ప్రవేశించడంతో, ఫిబ్రవరి 26న ముగియనున్న ఈ మహోత్సవానికి మరో అద్భుతమైన ఖగోళ ఘట్టం తోడవ్వనుంది. ఫిబ్రవరి 28న సౌర మండలంలోని ఏడు గ్రహాలన్నీ ఒకేసారి రాత్రి ఆకాశంలో ప్రత్యక్షమయ్యే అరుదైన దృశ్యం మనకు కనువిందు చేయనుంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఏడు గ్రహాలు ఒకే సరళ రేఖపై రానున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. రాత్రి సమయంలో భారతదేశం…
Minister Kishan Reddy: భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ధార్మిక సమ్మేళనాల్లో మహా కుంభమేళా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. ప్రపంచం నలుమూలల నుండి కోట్ల సంఖ్యలో భక్తులు ఈ మహామేళాకు తరలి వస్తున్నారు. గంగ, యమునా, సరస్వతీ నదుల సంగమ స్థానంలో పుణ్యస్నానం ఆచరించడం ద్వారా మోక్షాన్ని పొందుతారనే విశ్వాసంతో భక్తజనం ఉత్సాహంగా పాల్గొంటారు. Read Also: AP Cabinet: ఢిల్లీకి…
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇటీవలి తొక్కిసలాట సంఘటనలను ఉటంకిస్తూ.. మహా కుంభ్‌ను 'మృత్యు కుంభ్' అన్నారు. ఈ కుంభమేళాలో వీఐపీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని.. పేదలు దానికి సౌకర్యాలు కరువయ్యాయన్నారు.
మహా కుంభమేళా..ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక పండుగ.ప్రారంభమైన తొలి రోజే నుంచి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నో వింతలు, విశేషాలు,మరెన్నో ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది.ప్రయాగ్ రాజ్ వెళ్లిన భక్తులకే కాదు..టీవీల ముందు కూర్చుని చూసినోళ్ల గుండెల్లో భక్తిపారవశ్యం ఉప్పొంగుతోంది.అన్నిదారులు ప్రయాగ్ రాజ్ వైపే.ఏ రైలు చూసినా, ఏ బస్సు చూసినా కిటకిటే. ఎవరినోట విన్న కుంభమేళామాటే.స్వయంగా వెళ్లిన వారి ఆనందం మాటల్లో వర్ణించిలేనిది.
మహా కుంభమేళాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులతో వెళ్తున్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు మృతిచెందారు. మరో 19 మంది గాయపడ్డారు.
Mamata Banerjee: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మీడియాతో బుధవారం మాట్లాడారు. ‘‘మహా కుంభమేళాలో చాలా మంది మరణించారు. కానీ సరైన సంఖ్యని చెప్పడం లేదు. వారు కుంభమేళాకి హైప్ పెంచారు. అందుకు తగ్గట్లుగా సౌకర్యాలు చేయలేదు. పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించారు. కానీ వేదికల వద్ద…