మాఘి పూర్ణిమ సందర్భంగా మహా కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు 73 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ నెల 26 వరకు కుంభమేళా కొనసాగనున్నది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు. తాజాగా వ్యాపార దిగ్గజం, అపర కుభేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో…
Massive Traffic Jams: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకి భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్తున్నారు. దీంతో కుంభమేళాకు వెళ్లే అన్ని దారులు కూడా రద్దీగా మారాయి. చాలా ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్ ఎదురయ్యయాయి. వేలాది మంది భక్తులు రాత్రంతా హైవేపై గడపాల్సి వచ్చింది.
మహా కుంభమేళాలో భాగంగా ఫిబ్రవరి 12న ప్రయాగ్‌రాజ్‌లో మాఘి పూర్ణిమ స్నానం జరగనుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో యూపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది.
మహా కుంభమేళాలో మరో ఘోరం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి మినీ బస్సులో బయల్దేరిన భక్తులను ట్రక్కు రూపంలో మృత్యువు వెంటాడింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు అత్యంత భారీగా భక్తులు పోటెత్తారు. తాజాగా మహా కుంభమేళాకు ఊహించని రీతిలో తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. కనీసం కాలు తీసి కాలు వేయలేనంతగా భక్తులు తరలివచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానం ఆచరించారు. అనంతరం ప్రార్థనలు చేశారు. అంతకముందు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి యూపీకి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని రాష్ట్రపతి పుణ్య స్నానం ఆచరించారు. అలాగే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానం…
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పుణ్యస్నానాల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ కూడా ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పుణ్యస్నానం చేశారు.
Maha Kumbh Mela 2025: నేడు (శుక్రవారం) ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. వార్త అందే సమయానికి మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. శంకరాచార్య మార్గ్ లోని సెక్టార్-18లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దీని కారణంగా అక్కడ ఉన్న అనేక టెంట్లు బూడిదయ్యాయి. టెంట్ కు మంటలు అంటుకున్న వెంటనే చుట్టుపక్కన ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు. అయితే అక్కడ…