Mahakumbh 2025 : మహాకుంభ మేళా మహోత్సవంలో జరిగిన భయంకర తొక్కిసలాట పై కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అఖారా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పురి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sanjay Raut: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో మొత్తం 30 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఇప్పుడు దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్షాలు మృతుల సంఖ్యని స్పష్టం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ సహా ఇతర ప్రతిపక్షాలు యోగి సర్కార్‌పై ఆరోపణలు చేస్తున్నాయి.
Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి భూటాన్ రాజు వచ్చారు. ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనస్వాగతం పలికారు. మంగళవారం ఆయన త్రివేణి సంగమంతో పవిత్ర స్నానం చేశారు. దీనికి ముందు రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్ సూర్యుడికి ‘‘అర్ఘ్యం’’ సమర్పించారు.
Hema Malini: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో, మౌని అవామాస్య రోజున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది భక్తులు మరణించారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో సంగమం ప్రదేశంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అయితే, ఈ ఘటనపై ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో పాటు ఏదైనా కుట్ర కోణం ఉందా..? అనే విచారణ జరుగుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా.. ఇక సోమవారం వసంత పంచమి కారణంగా భక్తులు అంతకంతకు రెట్టింపుగా తరలివచ్చారు.
Jaya Bachchan: మహ కుంభమేళాపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలోని గంగా, యమునా నదుల్లోని నీరు కలుషితమైందని ఆమె సోమవారం ఆరోపించారు. గత నెలలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలోకి విసిరేసినందుకు, నదిలోని నీరు కలుషితమైందని అన్నారు.
Kumbh stampede: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది వరకు భక్తులు మరణించారు. 60 మంది వరకు గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరుగైన నిర్వహణ విధానాలను కోరుతూ పిటిషనర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ రోజు పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది దురదృష్టకరమైన సంఘటన, ఆందోళన కలిగించే విషయం, కానీ మీరు దీనిపై హైకోర్టుని ఆశ్రయించండి.…
Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరగుతున్న మహా కుంభమేళాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది యోగి ప్రభుత్వం. ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో యూపీ అధికారులు అలర్ట్ అయ్యారు. జనవరి 29న కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది భక్తులు మరణించారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉండవచ్చేని అనుమానిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా సాగుతోంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక సినీ, రాజకీయ, క్రీడాకారులంతా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
KumbhMela Special Trains: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లాలని భావిస్తున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) గుడ్ న్యూస్ చెప్పింది. కుంభమేళా కోసం 06 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ ట్రైన్లు బీదర్-దానాపూర్, చర్లపల్లి-దానాపూర్, దానాపూర్-చర్లపల్లి మధ్య నడవనున్నాయి. బీదర్-దానాపూర్-చర్లపల్లి మధ్య 02 రైళ్లు, చర్లపల్లి-దానాపూర్-చర్లపల్లి మధ్య 04 సర్వీసులను ఏర్పాటు చేశారు.