ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మమతా ప్రసంగించారు. ఇటీవలి తొక్కిసలాట సంఘటనలను ఉటంకిస్తూ.. మహా కుంభ్‌ను ‘మృత్యు కుంభ్’ అన్నారు. ఈ కుంభమేళాలో వీఐపీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని.. పేదలు దానికి సౌకర్యాలు కరువయ్యాయన్నారు.
READ MORE: Eatala Rajendar: హామీల అమలులో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది..
మహాకుంభ మేళా ఇప్పుడు మృత్యు కుంభమేళాగా మారిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇంత పెద్ద కార్యక్రమానికి ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు. తొక్కిసలాట సంఘటనలో మృతదేహాలను పోస్ట్ మార్టం చేయకుండానే బెంగాల్ కు తరలించారు. గుండెపోటుతో ప్రజలు చనిపోయారని, వారికి ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. మీరు దేశాన్ని విభజించడానికి మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. మరణ ధృవీకరణ పత్రాలు కూడా లేకుండా మృతదేహాలను పంపారు. మేము ఇక్కడే పోస్ట్‌మార్టం చేశాం. ఈ ప్రజలకు పరిహారం ఎవరు ఇవ్వాలి?” అని మమతా బెనర్జీ ప్రశ్నించారు.
READ MORE: Vice Chancellor: పలు యూనివర్సిటీలకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ