ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో హార్స్ పవర్ స్పోర్ట్స్ లీగ్ (హెచ్‌పీఎస్ఎల్) నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. హెచ్‌పీఎస్ఎల్ నిర్వహణకు హైదరాబాద్ బిజినెస్‌మెన్ సురేష్ పాలడుగు సన్నాహాలు చేశారు. హెచ్‌పీఎస్ఎల్ కోసం హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని సచిన్ తివారీ ఫార్మ్‌కు గుర్రాలను అక్రమంగా తరలించారు. హైదరాబాద్ నుంచి తరలించిన 57 గుర్రాల్లో ఎనమిది జబల్‌పూర్‌లో మృతి చెందాయి. మాల్ న్యూట్రిషన్ కారణంగా మృతి చెందినట్టు గుర్తించారు. Also Read: Kakani Govardhan Reddy: కాకాణిని కోర్టులో…
AICC Observers: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను దేశవ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించేందుకు ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం పరిశీలకులను నియమించింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు నేతలకు ఏఐసిసి పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నేత, సిడబ్ల్యూసి (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసిసి సెక్రటరీ సిరివెళ్ళ…
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన జరిగింది. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు, ఆమెపై చిత్రహింసలకు పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో మహిళ మరణించింది. ఖాండ్వాలో ఖల్వా పరిధిలోని రోష్నీ చౌకీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ దారుణమైన అత్యాచారం, హత్య జరిగింది.
High Court: 31 వారాల గర్భవతి అయిన మైనర్ బాలిక తన బిడ్డను ప్రసవించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. జస్టిస్ వినయ్ సరాఫ్ నేతృత్వంలోని సింగ్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత పూర్తి వైద్య సంరక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లైంగిక వేధింపులకు గురైన మైనర్ గర్భం దాల్చిందని పోలీసులు అదనపు జిల్లా జడ్జి (ADJ) కోర్టుకు తెలియజేశారు. అయితే, ఆ సమయంలో పిండానికి 29 వారాల 6 రోజుల వయసు…
S**X On Road: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌర్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ ధాకడ్ అనే వ్యక్తి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఆయన రాత్రి ఢిల్లీ-ముంబై 8-లేన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ మహిళతో కలిసి అసభ్యకర కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు కావడంతో. అదికాస్త సోషల్ మీడియాలో లీక్ అయింది. దీనితో వెంటనే అది వైరల్ కావడంతో వివాదం రేగింది. వివాదాస్పద వీడియోలో ధాకడ్ ఒక…
Snake-bite scam: మధ్యప్రదేశ్ లో ‘‘పాము కాటు కుంభకోణం’’ వెలుగులోకి వచ్చింది. సియోని జిల్లాలో 47 మంది మరణిస్తే, ఏకంగా 280 సార్లు మరణించారని ప్రకటించారు. ప్రతీసారి రూ. 4 లక్షలను ప్రకృతి వైపరీత్య సహాయాన్ని పొందారు. ఫలితంగా మొత్తం రూ. 11 కోట్ల 26 లక్షల అవినీతి జరిగింది. రెవెన్యూ అండ్ అకౌంట్స్ విభాగం దర్యాప్తులో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 37 మందిని నిందితులుగా చేర్చారు. ప్రధాన నిందితుడితో సహా 20…
Madhya Pradesh Minister: కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి విజయ్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో ఆయన పదవీగండం ఎదుర్కుంటున్నట్లు సమాచారం.
కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని చెప్పింది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని తెలియదా? అని ఫైర్ అయింది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది.