ఇటీవల పలువురి ఉపాధ్యాయుల తీరు చర్చనీయాంశంగా మారుతోంది. వారి ప్రవర్తనతో ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెస్తున్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన వారు వక్రమార్గాన్ని అనుసరిస్తున్నారు. దేవాలయాలుగా భావించే పాఠశాలలు, కళాశాలల్లో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు క్షణికావేశంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు విద్యార్థుల ముందే తన్నుకుంటున్నారు. ఇదే రీతిలో ప్రభుత్వ టీచర్లు జుట్లు పట్టుకుని పొట్టుపొట్టు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. Also Read:Samantha : సమంతకు స్టేజ్ పైనే…
Madhya Pradesh: మధ్యప్రదేశ రాష్ట్రంలోని భోపాల్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. భోపాల్-ఇండోర్ ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించిన రీల్ చూస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చిన తనపై దాడి చేశారని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Crime: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం జరిగింది. అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి సంబంధించిన వీడియోలు తీసి, ఇద్దర్ని బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై బాధితుల్లో ఒక మహిళ నిందితుడు ఫర్హాన్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో, అతడిని అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫర్హాన్తో పాటు అతడి స్నేహితుడు తనపై, తన సోదరిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.
మధ్యప్రదేశ్లోని ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వృద్ధుడిని వైద్య సిబ్బంది కనికరం లేకుండా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు వైద్యులపై సస్పెండ్ వేటు వేసింది.
ఈ మధ్య భార్యాభర్తల సంబంధాలు ఘోరంగా దెబ్బతింటున్నాయి. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. కలకాలం తోడుండాల్సిన భాగస్వాములను అర్థాంతరంగా వదిలించుకుంటున్నారు.
మధ్యప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యే గోలు శుక్లా కుమారుడు రుద్రాక్ష శుక్లా రెచ్చిపోయాడు. దేవాస్లోని ఒక కొండపై ఉన్న ప్రసిద్ధ మాతా టేక్రీ ఆలయాన్ని మూసేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో వచ్చి పూజారిపై దాడి చేశాడు.
Father Suicide: కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా కూతురు పెళ్లి చేసుకున్న కారణంగా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్లో చోటు చేసుకుంది. 49 ఏళ్ల మెడికల్ స్టోర్ యజమాని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రిషిరాజ్ అలియాస్ సంజూ జైస్వాల్గా గుర్తించిన ఆ వ్యక్తి తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుున్నాడు.
Theft: మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి, దొంగతనం చేసిన క్షమించాలని కోరుతూ లేఖ రాశాడు. ఖార్గోన్ జిల్లాలో ఒక దుకాణం నుంచి రూ. 2.45 లక్షలు దొంగలించిన వ్యక్తి, ‘‘రామ నవమి’’ రోజు దొంగతనం చేసినందుకు క్షమించాలని కోరాడు. అప్పులతో ఇబ్బందులు ఉన్నాయని, అప్పులు ఇచ్చిన వారు ఇబ్బందులు పెడుతున్నారని లేఖలో పేర్కొన్నాడు. ఆరు నెలల్లో దొంగిలిచిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని హామీ కూడా ఇచ్చాడని సోమవారం పోలీస్ అధికారులు చెప్పారు.
Fake Doctor: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నకిలీ డాక్టర్, కార్డియాలజిస్ట్ని అని చెప్పుకుంటూ పలువురు రోగులకు సర్జరీలు చేశాడు. ఈ ఘటనలో సర్జరీలు ముగిసిన తర్వాత ఏడుగురు పెషెంట్లు మరణించిన సంగతి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని దామోహ్ నగరంలోని ఒక ప్రైవేట్ మిషనరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్లు జరిగాయి. నకిలీ డాక్టర్ వైద్యం చేసినట్లు జిల్లా అధికారులు గుర్తించి, విచారణ ప్రారంభించారు.