High Court: 31 వారాల గర్భవతి అయిన మైనర్ బాలిక తన బిడ్డను ప్రసవించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. జస్టిస్ వినయ్ సరాఫ్ నేతృత్వంలోని సింగ్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత పూర్తి వైద్య సంరక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లైంగిక వేధింపులకు గురైన మైనర్ గర్భం దాల్చిందని పోలీసులు అదనపు జిల్లా జడ్జి (ADJ) కోర్టుకు తెలియజేశారు. అయితే, ఆ సమయంలో పిండానికి 29 వారాల 6 రోజుల వయసు అని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.
Read Also: JK: భర్తను దారుణంగా చంపిన భార్య, కుటుంబీకులు.. మృతదేహాన్ని ఏం చేశారంటే..?
ఈ దశలో గర్భస్రావం చేయడం వల్ల బాలిక ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరించారు. దీంతో ఈ కేసును కింది కోర్టు హైకోర్టుకు రిఫర్ చేసింది, ఆ తర్వాత హైకోర్టు బాలిక ప్రసవానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మైనర్‌తో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా గర్భధారణ గడువు వరకు కొనసాగించి బిడ్డను ప్రసవించడానికి తమ నిర్ణయాన్ని తెలుపుతూ హైకోర్టుకు లేఖ సమర్పించారు. ఈ సమయంలో పిండం వయసు 29 వారాలకు పైగా ఉందని నిర్ధారించిన డాక్టర్ నివేదికను కోర్టు పరిగణలోకి తీసుకుంది. 31 వారాల గర్భాన్ని తొలగిస్తే మైనర్ ప్రాణాలకు ప్రమాదం ఉందని తేలడంతో, గర్భాన్ని వైద్యపరంగా ముగించడానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని కోర్టు పేర్కొంది.
ప్రసవానికి ఖర్చుల్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, అంతే కాకుండా బిడ్డకు 12 తరగతి వరకు ఉచిత విద్య అందేలా చూడాలని, అన్ని వైద్య సౌకర్యాలు అందించాలని, తల్లీబిడ్డ గుర్తింపును ఖచ్చితంగా గోప్యంగా ఉంచాలని కోరింది.ఈ దశలో గర్భస్రావం చేయడం వల్ల బాలిక ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరించారు. గర్భధారణను ముగించడంపై వైద్య బోర్డులు సదుద్దేశంతో కూడిన అభిప్రాయాన్ని ఇచ్చినప్పుడు, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) చట్టం వాటిని రక్షిస్తుందని కోర్టు పేర్కొంది.