ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో హార్స్ పవర్ స్పోర్ట్స్ లీగ్ (హెచ్‌పీఎస్ఎల్) నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. హెచ్‌పీఎస్ఎల్ నిర్వహణకు హైదరాబాద్ బిజినెస్‌మెన్ సురేష్ పాలడుగు సన్నాహాలు చేశారు. హెచ్‌పీఎస్ఎల్ కోసం హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని సచిన్ తివారీ ఫార్మ్‌కు గుర్రాలను అక్రమంగా తరలించారు. హైదరాబాద్ నుంచి తరలించిన 57 గుర్రాల్లో ఎనమిది జబల్‌పూర్‌లో మృతి చెందాయి. మాల్ న్యూట్రిషన్ కారణంగా మృతి చెందినట్టు గుర్తించారు.
Also Read: Kakani Govardhan Reddy: కాకాణిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు!
హైదరాబాద్ రేస్ క్లబ్ నుంచి గుర్రాలను బిజినెస్‌మెన్ సురేష్ పాలడుగు అక్రమంగా తరలించారు. ఏప్రిల్ 29 నుంచి మే 5 మధ్య 57 గుర్రాలను రోడ్డు మార్గంలో జబల్‌పూర్ జిల్లాలోని రాయ్‌పుర అనే గ్రామానికి తరలించారు. ఇక్కడికు వచ్చిన కొద్ది రోజుల్లోనే కొన్ని గుర్రాలు అనారోగ్యానికి గురయ్యాయి. అందులో ఎనిమిది గుర్రాలు మరణించాయి. మరణించిన ఈ గుర్రాలు థోరోబ్రెడ్, కథియావారీ, మార్వారీ జాతులకు చెందినవి. గుర్రాల మరణం ఇప్పుడు కలకలం రేపుతోంది. గుర్రాల మృతిపై మధ్యప్రదేశ్ హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. సురేష్ పాలడుగుకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు హెచ్‌పీఎస్ఎల్ నిర్వహణపై మండిపడుతున్నారు.