The Kerala Story: వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది ‘ది కేరళ స్టోరీ’ సినిమా. ఇప్పటికే ఈ సినిమాపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ సినిమా విడుదల చేయకుండా స్టే ఇవ్వాలని పలువురు సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ..కోర్టులు అందుకు నిరాకరించాయి. దీంతో శుక్రవారం దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద భద్రతను కల్పించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ ప్రకటించింది.
Woman Killed By Dogs: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై వీధికుక్కులు దాడి చేసి ప్రాణాలు తీశాయి. అనంతరం మృతదేహాన్ని పీక్కుతిన్నాయి.
మధ్యప్రదేశ్‌లో వివాహ పథకం లబ్ధిదారుల జాబితాలో కొంతమంది మహిళల పేర్లు లేకపోవడంతో వారి గర్భ పరీక్షలు పాజిటివ్‌గా రావడంతో వివాదం చెలరేగింది. వివాహ పథకం కింద లబ్ధి పొందేందుకు మహిళల అర్హతను తనిఖీ చేసేందుకు వారికి గర్భ పరీక్షలను నిర్వహించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీ విరుచుకుపడ్డాయి.
దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మరో చిరుత మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మృతి చెందింది. ఉదయ్ అనే మగ చిరుత కునో నేషనల్ పార్క్ వద్ద అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ ధృవీకరించారు.
Madhya Pradesh : మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో మానవత్వాన్ని నాశనం చేసే క్రూరమైన చర్య వెలుగులోకి వచ్చింది. భింద్ జిల్లాలో ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ చిన్నారి మృతదేహాన్ని కూలర్‌లో ఉంచారు.
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో చిరుతలు సందడి చేస్తున్నాయి. అయితే, పార్క్ నుండి కొన్ని ఆఫ్రికన్ చిరుతలను తరలించడానికి మరొక ఆవాసాన్ని గుర్తించాలని దేశంలోని అపెక్స్ వన్యప్రాణుల నిర్వహణ సంస్థను కోరుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA)కి లేఖ రాసింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయాడని అధికారుల చేత నిర్థారించబడిన వ్యక్తి రెండేళ్లకు సజీవంగా ఇంటికి రావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని, సన్నిహితులను షాకింగ్ కు గురిచేయడంతో పాటు తమ వ్యక్తి సజీవంగానే ఉన్నాడని తెలుసుకుని అంతా సంతోషిస్తున్నారు.
Married Couples Protest : పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతీ ఒక్కరూ తమ పెళ్లిని అట్టహాసంగా జరుపుకోవాలనుకుంటారు. బంధువులంతా తమ పెళ్లికి వచ్చి సందడి చేయాలని భావిస్తుంటారు.
పెళ్లి చేసుకోవాల్సిన జంట పోలీస్ స్టేషన్ దగ్గరకి వెళ్లింది. అక్కడే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు దిగింది. పోలీసులు పెళ్లి మండపం దగ్గర తమవారితో అనుచితంగా ప్రవర్తించారిని.. పెళ్లి పందరిలో నానా హంగామా చేశారని పెళ్లిజంట ఆరోపించారు. పోలీసులు వచ్చి చర్యలు తీసుకునే వరకు తామ పెళ్లి చేసుకోబోమని ఆ జంట పోలీస్ స్టేషన్ ముందు దాదాపు 3 గంటల పాటు నిరసనకు దిగింది.