African cheetah dies : కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మరో చిరుత మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మృతి చెందింది. ఉదయ్ అనే మగ చిరుత కునో నేషనల్ పార్క్ వద్ద అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ ధృవీకరించారు.చనిపోయిన చిరుత ఉదయ్ వయసు ఆరేళ్లు. ఆదివారం ఉదయం చిరుత అస్వస్థతకు గురికావడాన్ని అటవీశాఖ బృందం గమనించింది. అనంతరం పశువును శాంతింపజేసి వైద్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటల సమయంలో చిరుత మృతి చెందింది. కునో నేషనల్ పార్క్‌లో ఇది రెండో చిరుత మరణం. దాదాపు నెల రోజుల వ్యవధిలో కేఎన్‌పీలో ఇలాంటి ఘటన జరగడం గమనార్హం. అంతకుముందు మార్చి 27 న నమీబియా చిరుత సాషా కిడ్నీ వ్యాధి కారణంగా మరణించింది.
Also Read:Akkineni Nagarjuna: చిన్నప్పటి నుంచి అఖిల్ తో ప్రాబ్లమే.. డాక్టర్ కు చూపిస్తే
పశువైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించనుంది. పోస్టుమార్టం మొత్తం వీడియో, ఫోటో తీయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న ఉదయ్‌ను దక్షిణాఫ్రికా నుంచి 11 చిరుతలతో పాటు కునోకు తీసుకొచ్చారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుండి ఇరవై చిరుతలను తెప్పించారు. గత ఏడాది నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెట్టిన ఎనిమిది చిరుతల్లో ఒకటైన సాషా మార్చిలో మరణించింది. ఆదివారం రెండో చిరుత మృతితో వాటి సంఖ్య 18కి చేరింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!