Farming with alcohol: మద్యం ఆరోగ్యానికి హానికరం, అతిగా తాగితే పైకిపోవడమే. అయితే మద్యం పంటకలు మంచిదే అంటున్నారు మధ్యప్రదేశ్ రైతులు. పంటల్లో చీడపీడలను అరికట్టేందుకు దేశీ లిక్కర్ వాడుతున్నారు. దీంతో ఫలితాలు బాగుంటున్నాయని చెబుతున్నారు. పెరుగుతున్న పురుగుమందుల ధరలకు ఇది పరిష్కారం అంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదాపురం జిల్లా రైతులు ఇలా వినూత్నంగా వ్యవసాయం చేస్తూ.. చర్చనీయాంశంగా మారారు.
BJP vs Congress: మధ్యప్రదేశ్ ఎన్నికలు ముంచుకోస్తున్నాయి. గత 20 ఏళ్లుగా అక్కడ బీజేపీనే అధికారం చెలాయిస్తోంది. అయితే గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటు కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి మళ్లీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
Apache Helicopter: భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ ఈరోజు మధ్యప్రదేశ్‌లోని బింద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చాపరాల్‌లో సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Terrorists: ఈ మధ్య కాలంలో మధ్య ప్రదేశ్‌లో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిని కేంద్ర నిఘా సంస్థ ఎన్‌ఐఏ అరెస్టు చేస్తోంది. అందులో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం జబల్‌పూర్‌లోని 13 ప్రాం తాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసి, జేఎంబీ ఉగ్రసంస్థకు చెందిన వారిని అరెస్టు చేసింది. ఇదే నెలలో హిజ్బ్ ఉత్ తహ్రీర్‌కు చెందిన 16 మందిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, భోపాల్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ పోలీసులు అరెస్టు చేశారు. హెచ్‌యూటీ…
UPSC Exam: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమ్మాయిలకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ‘‘ఒకే ర్యాంక్, ఒకే రోల్ నెంబర్’’ రావడం, చివరకు వారిద్దరి ఫస్ట్ నేమ్ కూడా ఒకటే కావడం చర్చనీయాంశంగా మారింది.
UPSC Exam: భారతదేశంలో సివిల్స్ ఎగ్జామ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఎళ్లుగా సివిల్స్ కలలతో చాలా మంది కష్టపడుతుంటారు. ప్రతీ ఏడాది లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరమ్మాయిల పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే రోల్ నెంబర్, ఒకే ర్యాంక్ వచ్చింది. చివరకు వీరిద్దరి ఫస్ట్ నేమ్ కూడా ఒకటే. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది.
Cheetah Death : మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఇప్పటివరకు మూడు చిరుతలు చనిపోయాయి. వాటితో పాటు ఒక పిల్ల చిరుతకూడా చనిపోయింది. అయితే ఈ మరణాలకు అనారోగ్యమే కారణమని చెబుతున్నారు.
The Kerala Story: ఒక యువకుడితో రిలేషన్ లో ఉన్న మహిళ ‘‘ ది కేరళ స్టోరీ’’ చూసిన తర్వాత అతడిపై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు 23 ఏళ్ల యువకుడిని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Air travel for pilgrims: సీనియర్ సిటిజన్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం విమాన సౌకర్యాన్ని కల్పించింది. దానికి అవసరమయ్యే నిధులను కూడా ప్రభుత్వమే సమకూర్చనుంది. ఇలా తీర్థయాత్రలకు వెళ్లే సీనియర్ సిటిజన్లకు సౌకర్యం కలిపించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. ఆ
Terror attack: హైదరాబాద్లో అరెస్టయిన రాడికల్ ఇస్లామిక్ (హెచ్‌యూటీ) ఉగ్రవాదుల విచారణలో పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. భోపాల్ - హైదరాబాద్ ఉగ్ర కోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.