UPSC Exam: భారతదేశంలో సివిల్స్ ఎగ్జామ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఎళ్లుగా సివిల్స్ కలలతో చాలా మంది కష్టపడుతుంటారు. ప్రతీ ఏడాది లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరమ్మాయిల పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే రోల్ నెంబర్, ఒకే ర్యాంక్ వచ్చింది. చివరకు వీరిద్దరి ఫస్ట్ నేమ్ కూడా ఒకటే. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది.
Read Also: Amit Shah: మోడీ మూడోసారి ప్రధాని అవుతారు.. 300 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తాం.
మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాకు చెంది. అయాషా ఫాతిమా(23), అలీరాజ్ పూర్ జిల్లాకు చెంది అయాషా మక్రానీ(26) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ఇద్దరికి ఒకే విధంగా 184 ర్యాంకు వచ్చింది. ఈ విషయంపై స్థానిక పోలీసులకు, యూపీఎస్సీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. నేను రెండు సంవత్సరాలుగా కష్టపడి చదివానని, నా హక్కుని మరెవరో తీసుకున్నారని అయాషా మక్రానీ వాపోయారు. యూపీఎస్సీ, ప్రభుత్వం నుంచి తనకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. అయితే దీనిపై అయాషా ఫాతిమా స్పందించారు. ఇద్దరికి ఒకే రోల్ నెంబర్ ఉందని తెలుసుకుని షాక్ అయ్యానని చెప్పారు. అధికారులు ఎలాంటి మోసం జరగకుండా చూస్తారని అనుకుంటున్నానని ఆమె అన్నారు..
వారిద్దరి అడ్మిట్ కార్డులను నిశితంగా పరిశీలిస్తే కొన్ని వ్యత్యాసాలు కనిపించాయి. మక్రానీ కార్డ్ పర్సనాలిటీ టెస్ట్ తేదీని ఏప్రిల్ 25, 2023 గురువారం రోజు పేర్కొనబడింది.. అయితే ఫాతిమా కార్డులో కూడా తేదీని చూపుతుంది, అయితే ఆ రోజు మంగళవారంగా పేర్కొనబడింది. నిజానికి క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 25 మంగళవారం. ఫాతిమా కార్డు క్యూఆర్ కోడ్ కలిగి ఉండటంతో పాటు వాటర్ మార్క్ కలిగి ఉంది. మక్రానీ కార్డు క్యూాఆర్ కోడ్ లేకుండా సాదా కాగితంపై ప్రింట్ అవుట్ తో ఉంది. చివరకు అయాషా ఫాతిమా సరైన అభ్యర్థి అని యూపీఎస్సీ వర్గాలు తెలిపాయి. పొరపాటు ఎలా జరిగిందో విచారిస్తామని అన్నారు.