‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లా సబ్ జైలులో 23 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజుకు నేడు బెయిల్ మంజూరైంది. బెయిల్పై జైలు నుండి విడుదలైన ఆయనకు కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికి ఆనందం వ్యక్తం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో ప్రజాపోరాటాలు చేయడం సహజమని, కానీ తమపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికి పిల్లలను, కుటుంబాలను లాగడం అత్యంత దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యంగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదాన్ని కూటమి నాయకులు కుట్రపూరితంగా హత్యాయత్నం కేసుగా చిత్రీకరించి, అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తీవ్ర అభద్రతా భావంతో ఉంటూ, తనపై కక్ష తీర్చుకోవడానికి తన కుమారుడి భవిష్యత్తును బలిచేసేందుకు ప్రయత్నించిందని విమర్శించారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)తో మాట్లాడి, తన అనుభవాన్ని తప్పుడు కేసులకు ఉపయోగించారని ఆరోపించారు. ఈ అన్యాయంపై మత్స్యకార సామాజికవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు లభించిన ప్రజా మద్దతు, ప్రజలలో వ్యక్తమవుతున్న తిరుగుబాటుకు సజీవ నిదర్శనమని చెప్పారు. ప్రారంభంలో తనకు కొంత నిరాశ భావం ఉన్నప్పటికీ, జైలు ములాఖాత్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలిసి ధైర్యం చెప్పారని పేర్కొన్నారు.
ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి పర్యటన నిర్ణయం, లక్షలాది మంది ప్రజలు స్పందించిన తీరు ఎంతో గర్వాన్ని, కొండంత ధైర్యాన్ని ఇచ్చాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, పేరాడ తిలక్, ఆమదాలవలస ఇంచార్జ్ చింతాడ రవికుమార్లపై కూడా తప్పుడు కేసులు బనాయించి వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువ మాట్లాడనని, న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..