Akhilesh Yadav: ‘18 ఏళ్లు రాగానే బీజేపీని ఓడించండి’.. జెన్ ఆల్ఫాకు అఖిలేష్ పిలుపు
- జెన్-జెడ్, జెన్-ఆల్ఫా యువ ఓటర్లపై అఖిలేష్ యాదవ్ ఫోకస్.
- 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు.
- బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో గద్దె దించాలని యువతకు సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, సమాజ్‌వాదీ(ఎస్పీ)లు ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా యువ ఓటర్లకు గాలం వేస్తున్నాయి. ఇదిలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఢిల్లీ నుంచి బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్దె దించాలని ఆయన యువతకు స్పష్టంగా పిలుపునిచ్చారు.
ఢిల్లీలో ఇటీవల యువత ఆందోళనలు, యూపీలో ప్రస్తుత పరిస్థితిపై అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్‌ను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారస్తామని బీజేపీ చెబుతోందని, కానీ రైతుల ఉత్పత్తులకు సరైన ధర కల్పించలేకపోతోందని విమర్శించారు. ప్రభుత్వం యువత, విద్యపై దృష్టి పెట్టి ఉంటే, వారికి ఉపాధి లభించేదని, గత 9 ఏళ్లుగా ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అన్నారు. 18 ఏళ్లు నిండిన వారు, నిండబోతున్నవారు ఈ పరిస్థితిని గమనించాలని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ ఎక్కడా పాల్గొనలేదని అన్నారు. యూపీ చరిత్రలోనే ఇది అత్యంత అవినీతి ప్రభుత్వం అని దుయ్యబట్టారు. బీజేపీ చారిత్రాత్మక కనౌజ్ నగరాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు.
Also Read
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
क्या किसान को ‘1 रुपये किलो’ आलू की क़ीमत देने से बनेगी ‘1 ट्रिलियन’ डॉलर की इकोनॉमी।
ये है ‘डील की ढील’ का परिणाम
हैरान-परेशान है देश का किसानवाह रे मुख्यमंत्री जी! pic.twitter.com/JWQOMpCkQZ
— Akhilesh Yadav (@yadavakhilesh) August 11, 2026
తాజావార్తలు
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
-
Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!