Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్‌గా అదరగొట్టేశాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venky Anil 5: టాలీవుడ్లో విక్టరీ వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ‘వెంకీ అనిల్ 5’ చిత్ర బృందం ఆయన అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘వెంకీ అనిల్ 5’ సినిమాకు సంబంధించి ఆయన లుక్‌కి సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో వెంకటేష్ లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం ‘వెంకీ అనిల్ 5’ (వర్కింగ్ టైటిల్) పేరుతో పిలుస్తున్నారు. వెంకటేష్‌తో అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఐదో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే ‘40 Glorious Years of our Victory Venky’ అంటూ చిత్రబృందం వెంకటేష్ సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేస్తూ ఈ స్పెషల్ లుక్‌ను అభిమానులతో పంచుకుంది. లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి అనే పాత్రలో వెంకటేష్ లుక్ పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ల సరసన కీర్తి సురేష్, కృతి శెట్టి నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్కు యాక్షన్, కామెడీ అంశాలను జోడిస్తూ అనిల్ రావిపూడి తన మార్క్‌లో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను మేకర్స్ విజయవంతంగా పూర్తి చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 40 ఏళ్ల విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఎన్నో విభిన్న పాత్రల్లో ఆయన కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’గా ఆయన కనిపించబోతుండటంతో ఈ పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.
Also Read
40 Glorious Years of our Victory @VenkyMama garu in TFI 😍😍😍
It’s an absolute honour to celebrate this incredible milestone with a very special look from our film 🤗
Meet our Lt colonel VENKAT REDDY🔥#VenkyAnil5 #NKRAR2 #40YearsOfVictoryVenkatesh pic.twitter.com/WcvkXFEuox
— Anil Ravipudi (@AnilRavipudi) August 14, 2026
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!