Madhya Pradesh: భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తు్న్నాయి. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు, హత్యలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ సియోనిలో భర్తతో గొడవపడిన భార్య, తన రెండేళ్ల కుమార్తెను హత్య చేసి, తాను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
Read Also: AP Police: స్టేజ్‌పై కోడి తల కొరికి చంపిన డ్యాన్సర్.. కేసు నమోదు
మొదట పసిపాపని నీటి తొట్టిలో ముంచి, ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా చనిపోవాలనే ఉద్దేశ్యంతో బావిలోకి దూకింది. చివరకు భర్త ఆమెను రక్షించాడు. సియోనిలోని చమరి తోలా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. భార్యభర్తల గొడవ జరిగిన తర్వాత ఆమె కూతురు ఖుషీని వాటర్ ట్యాంక్‌లో ముంచి చంపింది. ఆపై భార్య బావితో దూకగా, ఇది చూసిన భర్త విషతు లాల్ అహిర్వార్ ఆమెను రక్షించాడు. దురదృష్టవశాత్తు కూతురుని రక్షించలేకపోయాడు.
ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. నిందితురాలైన తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. మహిళకు 2021లో అహిర్వార్‌తో వివాహం జరిగింది. స్థానికంగా ఈ ఘటన ప్రజల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది.