August 15 History: ఆగస్టు 15.. భారత్‌కే కాదు ఈ 3 సరిహద్దు దేశాల చరిత్రలోనూ కీలక రోజే!
- ఆగస్టు 15 చరిత్ర..
- భారత్‌కే కాదు, పాక్, ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్‌లకు కీలక రోజే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
August 15: ఆగస్టు 15న భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమైంది. భారతదేశానికి బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం లభించిన తేదీ. ఎన్నో ఉద్యమాల తర్వాత 1947 ఇదే తేదీన మన భారతీయ పతాకం సగౌరవంగా రెపరెపలాడింది. ఈ తేదీ ఒక్క మనదేశానికే కాకుండా ఉపఖండంలోని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా ప్రముఖమైన తేదీగా ఉంది.
బంగ్లాదేశ్:
బంగ్లాదేశ్ జాతిపిత, మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మన్ని ఆగస్టు 15, 1975 రోజు సైన్యం తిరుగుబాటు చేసి చంపేసింది. ఆగస్టు 15ని ఆ దేశం ‘‘సంతాప దినం’’గా జరుపుకుంటుంది. అయితే, రిజర్వేషన్ కోటా ఉద్యమం కారణంగా షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, ఇండియా వచ్చేసింది.
Also Read
- Bhojshala Case: "భోజ్‌శాల హిందువులదే".. ఆలయం ఎలా మసీదుగా మారింది, చరిత్ర ఏం చెబుతోంది.?
- Vande Mataram: స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన 'వందేమాతరం'.. ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..?
- India Constitution Day History: మీకు తెలుసా! భారత తొలి గణతంత్ర పరేడ్‌కు ముఖ్య అతిథిగా పాకిస్థాన్ గవర్నర్ జనరల్..
- What's Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
పాకిస్తాన్లో ఒకప్పుడు అంతర్భాగంగా ఉన్న బంగ్లాదేశ్, ముజిబుర్ రెహ్మాన్ పోరాట ఫలితంగా 1971లో ఇండియా సాయంతో స్వాతంత్య్రాన్ని సంపాదించుకుంది. 1975లో ఆరుగురు మిడ్-ర్యాంకింగ్ ఆర్మీ అధికారులు కొంత మంది సైనికులతో కలిసి ఆయనపై తిరుగుబాటు చేసి హతం చేశారు. యాదృచ్ఛికంగా, హసీనా ప్రత్యర్థి బంగ్లాదేశ్ సైనిక పాలకుడు జియావుర్ రెహమాన్ భార్య ఖలీదా జియా ఆగస్టు 15న జన్మించింది.
ఆఫ్ఘనిస్తాన్:
అమెరికా సాయంతో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్యం నెలకొంది. అమెరికా సేనలు ఆఫ్ఘాన్ విడిచి వెళ్లడంతో మరోసారి ఆ ప్రాంతంలో తాలిబాన్ రాజ్యం ఏర్పడింది. ఆగస్టు 15, 2021లో కాబూల్‌లో తాలిబాన్ పాలకులు అధికారాన్ని చేపట్టారు. ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచిపారిపోవడంతో ఆ దేశం తాలిబాన్ పాలనలోకి వెళ్లింది.
పాకిస్తాన్:
పాకిస్తాన్‌కి కూడా ఆగస్టు 15తో సంబంధం ఉంది. ఒక రోజు తేడాతో మత ప్రాతిపదిక విడిపోయి స్వాతంత్య్రం పొందిన భారత్-పాక్‌లు ఈ తేదీని గుర్తుంచుకుంటాయి. దేశ విభజన 1947లో తీవ్రమైన వలసలు, మత కలహాలకు కారణమైంది. పాకిస్తాన్‌లోని మతోన్మాద మూకలు హిందువులు, సిక్కులని ఊచకోత కోశాయి.
ఇదే కాకుండా ఆగస్టు 15న తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి రావడంపై ఎక్కువగా సంతోషించిన దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. అయితే, ఇప్పుడు మాత్రం తీవ్రంగా బాధపడుతోంది. పాకిస్తాన్ తాలిబాన్లు, ఆఫ్ఘనిస్తాన్ అండతో పాకిస్తాన్లో దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో దాడులకు పాల్పడుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ..‘‘ బానిస సంకెళ్లు తెగిపోయాయి’’ అని కామెంట్ చేశారు. అయితే, కొద్దికాలానే తాలిబాన్ పాలకు పాకిస్తాన్‌కి చుక్కులు చూపిస్తు్న్నారు. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఎప్పటి నుంచో నడుస్తోంది. డ్యూరాండ్ లైన్‌ని ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవడం లేదు. ఇరు వర్గాల మధ్య ఈ ప్రాంతంతో దాడులు జరుగుతున్నాయి. దీంతో పాకిస్తాన్‌కి అప్పటి ప్రజాస్వామ్య పాలనే బాగుండేదనే భావన కలుగుతోంది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!