Saif Ali Khan : సైఫ్ అలీఖాన్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. తన తాతల నుంచి వచ్చిన ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా గుర్తిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.15వేల కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ కింద మార్చేయడంతో తల పట్టుకుంటున్నాడు సైఫ్. అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె సాజిదా. సైఫ్ అలీఖాన్ కు ఈమె నానమ్మ అవుతుంది. హమీదుల్లా…
High Court: 31 వారాల గర్భవతి అయిన మైనర్ బాలిక తన బిడ్డను ప్రసవించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. జస్టిస్ వినయ్ సరాఫ్ నేతృత్వంలోని సింగ్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత పూర్తి వైద్య సంరక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లైంగిక వేధింపులకు గురైన మైనర్ గర్భం దాల్చిందని పోలీసులు అదనపు జిల్లా జడ్జి (ADJ) కోర్టుకు తెలియజేశారు. అయితే, ఆ సమయంలో పిండానికి 29 వారాల 6 రోజుల వయసు…
ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై నోరు జారిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది.
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. కోర్టు ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కొనసాగించింది. అనంతరం ఈ కేసు విచారణను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం మార్చి 26కి వాయిదా వేసింది. అంతకుముందు.. శివరాజ్ సింగ్ చౌహాన్‌పై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. దీంతో చౌహాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శివరాజ్…
High Court: పెళ్లి తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో ‘‘అసభ్యకకరమైన’’ సంభాషణల్లో పాల్గొనకూడదని, ఏ భర్త తన భార్య నుంచి అలాంటి చాటింగ్‌ని సహించలేడని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. విడాకులకు అనుమతి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
MP High Court: ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ దాఖలు చేసిన అత్యాచారం కేసుని మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పెళ్లి చేసుకుంటాననే హామీపై వివాహిత స్త్రీ మరొక పురుషుడితో శారీరక సంబంధానికి సమ్మతించానని చెప్పుకోవడానికి వీలులేదని జస్టిస్ మణీందర్ ఎస్ భట్టీ తన తీర్పులో వెల్లడించారు. తప్పుడు వివాహ హమీ సాకుతో శారీరక సంబంధానికి అంగీకరించానని వివాహిత స్త్రీ చెప్పడం సరైనది కాదని హైకోర్టు పేర్కొంది.
High Court: భర్త కాకుండా, వేరే వ్యక్తితో భార్యకు శారీరక సంబంధం లేకుండా ప్రేమ, అనురాగం ఉంటే దానిని అక్రమ సంబంధంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. అక్రమ సంబంధానికి లైంగిక సంపర్కం తప్పనిసరి అని జస్టిస్ అహ్లువాలియా తీర్పు చెప్పారు. కుటుంబ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ, ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ని విచారిస్తున్న సమయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Enemy Act: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఇటీవల ఆయన ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇదిలా ఉంటే, మరో వార్తలో ఆయన సంచలనంగా మారారు.
Live-in Relationship: మధ్యప్రదేశ్ హైకోర్టు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన పిటిషన్‌పై కీలక తీర్పు ఇచ్చింది. పెద్దలు పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో తీర్పును జస్టిస్ సుబోధ్ అభ్యంకర్ సింగిల్ బెంచ్ ఇచ్చారు. పిటిషనర్లిద్దరికీ 18 ఏళ్లు పైబడిన వారేనని, వారు స్వేచ్చగా తమ ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఇకపై బయటి వారి జోక్యం నుంచి ఈ హక్కును కాపాడుకోవాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. కానీ,…
Garlic: భారతీయ వంటకాల్లో వెల్లుల్లి చాలా ప్రముఖం. వంటల్లో వెల్లుల్లిని వాడితే దాని రుచి, సువాసన అమోఘంగా ఉంటుంది. సాధారణంగా దాని ఘాటు వాసన కారణంగా దీనిని వంటల్లో తరుచుగా మసాలాగా పరిగణించబడుతుంది. అయితే, ఈ వెల్లుల్లి మధ్యప్రదేశ్‌లో దశాబ్ధకాలంగా చర్చనీయాంశంగా మారింది. వెల్లుల్లి కూరగాయనా..? లేదా మసాలా..? అనే విషయంపై సాగుతున్న చర్చకు మధ్యప్రదేశ్ హైకోర్ట్ ఫుల్‌స్టాప్ పెట్టింది.