ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై నోరు జారిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది.
ఇటీవల పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనికి కల్నల్ సోఫియా ఖురేషి నాయకత్వం వహించారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేస్తూ చాలా పాపులర్ అయింది. ఒక్కసారిగా ఆమె పేరు మార్మోగింది.
ఇది కూడా చదవండి: Laya : బాలకృష్ణ సినిమాలో నన్ను తీసేయమన్నాడు.. సీక్రెట్ చెప్పిన లయ..
అయితే ఆమెపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షా నోరు పారేస్తున్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరం తుడిచేస్తే.. అదే ఉగ్రవాదుల మతానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషిని ప్రధాని మోడీ పాకిస్థాన్‌పైకి పంపించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. భారత ముద్దు బిడ్డపై అనుచిత వ్యాఖ్యలు ఏ మాత్రం సహించరానివని.. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని హస్తం నేతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా జాతీయ మహిళా కమిషన్ కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. వెంటనే మంత్రి కేసు నమోదు చేయాలని రాష్ట్ర పోలీస్ చీఫ్‌కు ధర్మాసనం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Bhargavastra: విజయవంతంగా ‘భార్గవస్త్ర’ పరీక్ష ప్రయోగం.. దీని శక్తి ఏ స్థాయిలో ఉంటుందంటే..!
'कर्नल सोफिया कुरैशी आतंकवादियों की बहन हैं'
– ये घटिया बात मध्य प्रदेश में BJP सरकार के मंत्री विजय शाह ने कही है।
जिस भारत की बेटी कर्नल सोफिया कुरैशी पर सबको नाज है, उस बेटी को लेकर ये शर्मनाक बयान दिया गया है। उन्हें आतंकवादियों की बहन बताया गया है।
ये हमारी पराक्रमी सेना… pic.twitter.com/mQMXPyraWJ
— Bihar Congress (@INCBihar) May 13, 2025