Garlic: వెల్లుల్లి కూరగాయా..? లేదా మసాలా..? దశాబ్ధాల చర్చకు హైకోర్టు పరిష్కారం..
- వెల్లుల్లి కూరగాయనా..? లేదా మసాలానా..?
- దశాబ్ధకాలం నాటి కేసుకు ఎంపీ హైకోర్టు పరిష్కారం..
- కూరగాయ మార్కెట్‌తో పాటు మసాలా మార్కెట్‌లో విక్రయానికి అనుమతి..
- కూరగాయ అని తీర్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Garlic: భారతీయ వంటకాల్లో వెల్లుల్లి చాలా ప్రముఖం. వంటల్లో వెల్లుల్లిని వాడితే దాని రుచి, సువాసన అమోఘంగా ఉంటుంది. సాధారణంగా దాని ఘాటు వాసన కారణంగా దీనిని వంటల్లో తరుచుగా మసాలాగా పరిగణించబడుతుంది. అయితే, ఈ వెల్లుల్లి మధ్యప్రదేశ్‌లో దశాబ్ధకాలంగా చర్చనీయాంశంగా మారింది. వెల్లుల్లి కూరగాయనా..? లేదా మసాలా..? అనే విషయంపై సాగుతున్న చర్చకు మధ్యప్రదేశ్ హైకోర్ట్ ఫుల్‌స్టాప్ పెట్టింది.
వెల్లుల్లి కూరగాయ అని, దీనిని కూరగాయల మార్కెట్, మసాలా మార్కెట్ రెండింటిలో విక్రయించేందుకు అనుమతినిస్తూ హైకోర్టు తీర్మానం చేసింది. వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా వర్గీకరిస్తూనే, కూరగాయగా పరిగణించేందుకు అనుమతించడం ద్వారా రైతులకు, వ్యాపారులకు ఈ తీర్పు ప్రయోజనం చేకూరుస్తోందని భావిస్తున్నారు. కూరగాయలు, మసాలా మార్కెట్‌లో విక్రయించడానికి ఈ తీర్పు అనుమతిస్తుంది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
వెల్లుల్లి దాని రుచికి ప్రసిద్ధి చెందింది. దాని బలమైన రుచి, వాసన కారణంగా వంటల్లో మసాలాగా పరిణించబడుతోంది. అయితే, వృక్షశాస్త్ర పరంగా చూస్తే దీనిని కూరగాయగా వర్గీకరించబడింది. 2015లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైతు సంస్థ వెల్లుల్లిని కూరగాయగా వర్గీకరించడానికి మధ్యప్రదేశ్ మండి బోర్డును ఒప్పించిన వివాదంపై కోర్టు ఈ తీర్పు చెప్పింది. అయితే, వ్యవసాయ శాఖ 1972 వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ చట్టం ప్రకారం వెల్లుల్లిని మసాలాగా తిరిగి వర్గీకరించడం ద్వారా వెంటనే ఈ చర్యను మార్చేసింది.
Read Also: AP Super Speciality Hospitals: ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నోటీసు
ఈ నిర్ణయం వల్ల ఏ రాష్ట్ర ప్రభుత్వ మార్కెట్లు అయినా వెల్లుల్లిని విక్రయించగలవు. ఇది రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కమీషన్ ఏజెంట్లను ప్రభావితం చేయగలవు. దీంతో బంగాళాదుంప, ఉల్లిపాయ, వెల్లుల్లి కమీషన్ ఏజెంట్ అసోసియేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2016లో ఇండోర్ బెంచ్ హైకోర్టుని ఆశ్రయించింది. 2017లో సింగిల్ జడ్జ్ బెంజ్ అసోషియేషన్‌కి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వ్యాపారుల మధ్య వివాదం చెలరేగింది. ఈ నిర్ణయం రైతుల కన్నా ఏజెంట్లు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుందని వాదించారు.
జూలై 2017లో ముఖేస్ సోమని దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ డి వెంకటరామన్‌లతో కూడిన ఇండోర్ బెంచ్ ఇటీవల ఉత్తర్వులను జారీ చేసింది. హైకోర్టు జెంచ్ 2017 తీర్పును సమర్థించింది. గతంలో వెల్లుల్లి విక్రయాల విధానాన్ని పునరుద్ధరించింది. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులను ఏజెంట్లు ఎలాంటి కమీషన్ చెల్లించకుండా నేరుగా మార్కెట్‌లో విక్రయించవచ్చు. హైకోర్టు తీర్పులో.. వెల్లుల్లి పాడైపోయేదని అందువల్ల కూరగాయ అని తీర్పు చెప్పింది. మొక్కను కూరగాలు, సుగంధ ద్రవ్యాల మార్కెట్‌లో విక్రయించవచ్చని కూడా తీర్పులో పేర్కొంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?