కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.
కృష్ణా జిల్లా వైసీపీలో బందరు ఎంపీ సీటు రచ్చ కొనసాగుతుంది. అయితే, బందరు ఎంపీ అభ్యర్థిగా వెళ్ళాలని అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను వైసీపీ అధిష్టానం కోరింది. దీనికి అతడు స్పందిస్తూ.. తాను చిన్న వాడిని సరిపోనేమో మరోసారి ఆలోచన చేయాలని వైసీపీ అధిష్టానాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ క�
గడచిన 75 సంవత్సరాల పాలన కంటే సీఎం జగన్ పాలన భిన్నమైనది అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చాలనేదే జగన్ తాపత్రయం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది రాజకీయ అవకాశం కల్పించాలని ఉద్యమాలు చేశారని మంత్రి చెప్పారు.
అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య చిక్కున్న మచిలీపట్నంకి చెందిన కావ్య అనే యువతిని జాలర్లు కాపాడారు. యువతి తన ప్రియుడితో కలిసి బీచ్ కి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాదానికి గురైంది.
బ్యానర్లు , ఫోటోలు వేసుకున్నంత మాత్రానా లీడర్లు అయిపోయాం అనుకోవద్దని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నాయకుడు ఏం చెబుతున్నాడో వినండి , దాన్ని ప్రచారం చేయండంటూ జనసేన నేతలకు ఆయన సూచించారు.
కులాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధించలేమని జనసేన అధినేత పవన్కళ్యాణ్ వెల్లడించారు. వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మచిలీపట్నానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.