Vallabhaneni Balashowry: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి.. ఇక, మరోసారి బందరు ఎంపీగా గెలవబోతున్నాను అనే ధీమా వ్యక్తం చేశారు బందరు లోక్ సభ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి.. మచిలీపట్నం ఎంపీగా గత ఐదేళ్ల కాలంలో పోర్టు సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ అభివృద్ధిని కంటిన్యూ చేస్తాం అన్నారు.. ఇక, బందరు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నాకు మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉందన్నారు.. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సహా టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలు పూర్తిగా తనకు సహకరిస్తున్నారి తెలిపారు..
Read Also: Tenant: టెనెంట్ ఎదురింట్లో, పక్కింట్లో జరిగే కథ!
మరోవైపు.. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం విదితమే కాగా.. ఆయనపై స్పందించిన బాలశౌరి.. సింహాద్రి చంద్రశేఖర్ మంచి డాక్టరే.. కానీ, రాజకీయాలకు కొత్త అన్నారు. నేను నా ప్రత్యర్థులను విమర్శించడం కంటే.. నేను పనితనంతోనే పైచేయి సాధిస్తాను అని వెల్లడించారు మచిలీపట్నం లోక్‌సభ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి.. కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి.. మచిలీపట్నంలో విజయం సాధించిన బాలశౌరి.. ఆ మధ్య వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి.. జనసేన పార్టీలో చేరిన విషయం విదితమే.. ఇక, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా.. మచిలీపట్నం ఎంపీ స్థానం జనసేన పార్టీకి రాగా.. బాలశౌరిని బరిలోకి దింపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.