మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జూలై 29వ తేదీ వర్చువల్ మోడ్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ను నిర్వహించింది. ఇందులో 2021-23కు జరగాల్సిన ఎన్నికలతో పాటు పలు అంశాలను చర్చించారు. ఆగస్ట్ 22న వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని ఈసీ సమావేశం నిర్ణయించింది. అయితే ఎన్నికలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. కానీ కొన్ని మీడియా సంస్థలలో ‘మా’ ఎన్నికలు సెప్టెంబర్ 12న జరుగబోతున్నాయంటూ వార్తలు రావడాన్ని’మా’ కార్యవర్గం తప్పు పట్టింది. అలాంటి నిర్ణయం ఈసీ…
టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికల విషయం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజాగా మంచు విష్ణు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మూవీ ఆర్టిస్ట్ ల మధ్య యూనిటీ లేదని ఆయన అన్నారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దాసరి నారాయణరావు చెప్తే అందరూ విన్నారని, దాసరి పోయాక ఇండస్ట్రీలో కొరత ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ కి…
“మా” కాంట్రవర్సీ రోజురోజుకూ ముదురుతోంది. ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో 5 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. అయితే ఈ విషయానికి సంబంధించి అభ్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్, స్టార్ హీరోలు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న ‘మా’ ఎలక్షన్స్ పై మొదటిసారిగా స్పందించిన నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ సమస్యలను బహిరంగంగా చర్చించడం సరికాదని హితవు పలికారు. అలాగే లోకల్, నాన్ లోకల్…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉండగానే పరిస్థితులు వేడెక్కుతున్న విషయం తెలిసిందే. “మా” ఎలక్షన్స్ లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఏకంగా 5 మంది ‘అధ్యక్ష’ పదవికి పోటీగా దిగుతున్నారు. అందులో యంగ్ హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ హీరోయిన్ జీవిత రాజశేఖర్, హేమ, మరో సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. అయితే వీరిలో మంచు విష్ణుకు సూపర్ స్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.…
‘మా’ ఎలక్షన్స్ కు ఇంకా దాదాపు 3 నెలల సమయం ఉండగానే అసోసియేషన్ లో హీట్ పెరిగిపోయింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ముందే ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. అయితే ఈదారి జీవిత రాజశేఖర్, హేమ కూడా రేసులో ఉన్నారు. అంతేకాదు ప్రముఖ నటుడు సివిఎల్ నరసింహారావు ఈ జాబితాలో చేరి, తాను కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అతను తన మ్యానిఫెస్టోలో తెలంగాణ కళాకారుల కోసం…
‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఎన్నికల తేదీ ప్రకటన రాకముందే… ఫిల్మ్ నగర్ లో వాతావరణం వేడెక్కింది. ఎన్ని ప్యానెల్స్ పోటీ పడతాయో తెలియదు కానీ అధ్యక్ష పదవికైతే ఐదారుగురు పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది. ఇదిలా ఉంటే… సినిమా రంగంలోని ప్రముఖులు సైతం ఇప్పుడిప్పుడే తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. తాజాగా చిత్రపురి హౌసింగ్ సొసైటీలో కీలక బాధ్యతలను నెరవేర్చుతున్న కాదంబరి కిరణ్ సైతం దీనిపై పెదవి విప్పారు. ప్రస్తుతం ఆయన ఆర్టిస్టుగానే కాకుండా సమాజ సేవా కార్యక్రమాలతోనూ…
ప్రముఖ నటుడు, న్యాయవాది సి.వి.ఎల్. నరసింహారావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారు. కళాకారులకు ప్రాంతీయ సరిహద్దులు ఉండవని, వారిని లోకల్ – నాన్ లోకల్ గా చూడటం తప్పని ఇప్పటికే ప్రకాశ్ రాజ్ వర్గం చెబుతుండగా, సీవీఎల్ నరసింహారావు మాత్రం తన ఎన్నికల నినాదం ‘తెలంగాణ వాదం’ అని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా తెలంగాణా కళాకారులు ఇబ్బంది పడుతున్నారని, అలానే ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిన్న, పేద, మధ్య…
‘మా’ అధ్యక్ష పదవికి ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పరభాషా నటుడు ప్రకాష్ రాజ్ కూడా ‘మా’లో పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన పనెల్ సభ్యులను కూడా ప్రకటించారు. తాజాగా ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా… ఎందుకు ఎలక్షన్స్ లో నిలబడ్డాడో వివరించారు ప్రకాష్ రాజ్. అలాగే మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ చిరంజీవి సపోర్ట్ ప్రకాష్ రాజ్ కు ఉందని,…
తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ ‘మా’ అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాలు మాత్రమే పోటీ పడేవి. కానీ ఈసారి మాత్రం సినీ పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు అధ్యక్ష పదవి కోసం పోటీకి సిద్ధమయ్యారు. కొన్ని రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ పోటీ పడనున్నారు. దీనితో ఈసారి పోటీ ఉత్కంఠభరితంగా మారింది.…