‘మా’ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈరోజు నుంచి సెప్టెంబర్ 29 వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇచ్చారు. అక్టోబర్ రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన, అనంతరం అక్టోబర్ 10న ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను వెల్లడించి ‘మా’ అధ్యక్షుడు ఎవరో తేల్చేయనున్నారు. ఈరోజు ఉదయం…
మరో రెండు వారాల్లో ‘మా’ ఎన్నికలు జరగనుండడంతో హడావిడి మొదలైంది. ఇప్పటికే ‘మా’ అధ్యక్షా పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా సివిఎల్ నరసింహ రావు వంటి అభ్యర్థులు ‘మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య ఈ వార్ జరగనుంది. ఇటీవలే ప్రకాష్ రాజ్, విష్ణు తమ ప్యానెల్ లను, అందులో సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు…
‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కంటెస్టెంట్లు కూడా తన వంతు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇటీవలే తన ప్యానెల్ సభ్యులను ప్రకటించిన హీరో మంచు విష్ణు ప్రెస్ తో తాజాగా తన ఆలోచనలను పంచుకున్నారు. కానీ విష్ణు చేసిన వ్యాఖ్యలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ప్రస్తుత స్థితి గురించి తెలుపుతుంది. Read Also : హాలీవుడ్ పై కన్నేసిన సితార “మా ప్రెసిడెంట్ అనేది ట్యాగ్ కాదు, బాధ్యత. నేను…
‘మేమంతా కళామతల్లి ముద్దుబిడ్డలం.. మాకు కులం.. మతం.. జాతి బేధాలు ఉండవు.. మమ్మల్ని ఎవరూ విడదీయలేరని’ పదేపదే సినీనటులు చెబుతూ ఉంటారు. అయితే వీరిని ఎవరినీ విడదీయకుండానే వీళ్లలో వీళ్లే చిచ్చు పెట్టుకుంటున్నారు. ‘మా’ ఎన్నికల సాక్షిగా ఒకరిపై ఒకరు మీడియా ముఖంగా ఆరోపణలకు దిగుతున్నాయి. ఈక్రమంలోనే సీనిపెద్దలు రంగంలోకి దిగి బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దంటూ లేఖాస్త్రలను సంధిస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘మా’ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో ఈ లొల్లి మరింత పీక్స్ కు చేరుకోవడం ఖాయంగా…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు దగ్గర పడ్డాయి. మునుపెన్నడూ లేనంతగా ఈసారి ‘మా’ ఎన్నికల్లో రచ్చ చోటు చేసుకుంది. ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న పోటీదారులు తమ సొంత ఎజెండాతో బిజీగా ఉన్నారు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యంగ్ హీరో విష్ణు మధ్య పోటీ గట్టిగా ఉంది. మరోవైపు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించగా, విష్ణు ప్యానెల్ లో…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు, అధ్యక్షా పదవి కోసం కంటెస్టెంట్లు చేసే వ్యాఖ్యలు ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈసారి ఆ చర్చ మరింత వాడివేడిగా సాగుతోంది. ప్రకాష్ రాజ్ బృందం, మంచు విష్ణు బృందం ఎన్నికల్లో గెలిచేందుకు పోరాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ ‘మా’ సభ్యులను ఆకర్షించడానికి తమదైన మార్గాలు అనుసరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాని ‘మా’ ఎలక్షన్స్ పై చేసిన కామెంట్స్ పై సినీ పెద్దలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు…
సౌత్ సీనియర్ నటుడు ఓ పేద కుటుంబం జీవితం మెరుగుపడడానికి తన వంతు సాయం చేసి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని శ్రీరంగపట్నం, మైసూర్ సమీపంలోని ఒక కుటుంబానికి తాను జేసీబీని బహుమతిగా ఇచ్చానని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఆయన వారికి జేసీబీని అందజేసిన పోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ” ప్రకాష్ రాజ్‌ఫౌండేషన్ చొరవతో శ్రీరంగపట్నం, మైసూర్ సమీపంలో ఒక కుటుంబానికి జేసీబీతో సాధికారత కల్పించాం… వారి జీవితంలోకి…
గత కొంత కాలం నుంచి టాలీవుడ్ లో ఇండస్ట్రీలో “మా” ఎన్నికల వివాదం విషయమై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే “మా” అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించారు. అయితే ఆయన ప్యానల్ లో అంతకు ముందు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మరో ఇద్దరు మహిళలు జీవిత రాజశేఖర్, హేమ కూడా ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్…
వరుస వివాదాలు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఒక వైపు డ్రగ్స్ కేసులో ప్రముఖులపై విచారణ జరుగుతోంది. మరోవైపు “మా” అధ్యక్ష ఎన్నికలు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పటికే “మా” అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. దీనితో “మా”లోని లొసుగులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోకి ప్రవేశించడం, బండ్ల గణేష్ స్వతంత్రంగా పోటీ చేయడం వంటి విషయాలు మరిన్ని సందేహాలకు కారణమవుతున్నాయి.…