‘మా’లో ఎన్నికలు ముగిసినా యుద్ధవాతావరణంలో మార్పు లేదు. మా సభ్యులు మెజారిటీ మంచు విష్ణు ప్యానెల్ కి కట్టబెట్టినా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో కూడా కొంత మందిని గెలిపించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ ని, వైస్ ప్రెసిడెంట్ గా బెనర్జీని, జాయింట్ సెక్రెటరీగా ఉత్తేజ్ ని… అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా 8 మందిని ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిపించారు. అయితే వీరందరూ మంగళవారం తమను ఎన్నుకున్న మెంబర్లకు సారీ చెబుతూనే రాజీనామా చేశారు. అంతకు ముందు ఫలితాలు వెలువడిన రోజు రాత్రి ప్రకాశ్ రాజ్ కి అండగా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు ‘మా’లో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ మరుచటి రోజున ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ కూడా తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు. అయితే ప్రెసిడెంట్ గా తను వారి రాజీనామాలను అంగీకరించబోనని, ప్రత్యేకంగా కలిసి వారి సహాయసహకారాలను కోరతానని మంచి విష్ణు మీడియాకు తెలిపాడు.
Read Also : మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
ఇక ఎన్నికైన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యల పరిస్థితి ఏమిటి? విష్ణు ప్యానెల్ ముందున్న ఆప్షన్ ఏంటి? ఈ విషయానికి వస్తే మంచు విష్ణు ప్యానెల్ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు అంగీకరించబోమని అంటోంది. ఒక వేళ పట్టుదలతో ఉన్న ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు ససేమిరా అంటే పరిస్థితి ఏంటి? మంచు విష్ణు ముందున్న ఆప్షన్ ఏమిటి? బైలా ప్రకారం విష్ణు ప్యానెల్ కి మెజారిటీ ఉంది కాబట్టి రాజీనామా చేసిన వారి ప్లేస్ లో కొత్త వారిని కో ఆప్ట్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. అయితే మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని కాకుండా కొత్త వారిని కో ఆప్ట్ చేసుకుంటే బాగుంటుంది. మరి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటారా? విష్ణు ప్యానెల్ ఏ నిర్ణయం తీసుకోబోతోంది అన్నది తేలాల్సి ఉంది.