నిజాలు తెలుసుకోకుండా నా పేరు వాడిన వారిపై కోర్టుకు వెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చారు యాంకర్, నటి అనసూయ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవాళ్లు రాజీనామా ప్రకటన కోసం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.. ఆ కార్యక్రమానికి వచ్చిన అనసూయ.. అక్కడి నుంచి తిరిగి వెళ్తోన్న సమయంలో.. మా ఎన్నికలపై మీడియా ప్రశ్నించింది.. ఆ ప్రశ్నలపై కొంత అసహనం వ్యక్తం చేసిన ఆమె.. నన్ను మీరు ఘెరావ్ చేసినంత పనిచేశారంటూ వ్యాఖ్యానించారు. అయితే, మీకు ఇష్టం ఉంటేనే మాట్లాడండి.. లేకపోతే లేదంటూ మీడియా ప్రతినిధులు తెలపడంతో.. కాస్త ముందుకు కదిలిన అనసూయ.. మళ్లీ వెనక్కి వచ్చి.. నా ప్రమేయం లేకుండా.. నాపేరును తప్పుడు వార్తలకు వాడితే కోర్టుకు వెళ్తానంటూ.. సోషల్ మీడియా, మీడియాను హెచ్చరించారు.
కాగా, ‘మా’ ఎన్నికలపై అనసూయ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే.. ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి కార్యవర్గ సభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయారు అనసూయ.. అయితే.. ‘‘600 ఓట్లని లెక్కించడానికి రెండో రోజుకి ఎందుకు వాయిదా వేశారు. ఆదివారం గెలుపు అని చెప్పి ఈ రోజు ఓటమి అంటున్నారు, రాత్రికి రాత్రి ఏం జరిగింది? నిన్న ఎవరో ఎన్నికల నియమాలకి భిన్నంగా బ్యాలెట్ పేపర్లని ఇంటికి కూడా తీసుకెళ్లారని బయట చెప్పుకుంటున్నారు’’ అంటూ ఆమె చేసిన ట్వీట్ చర్చగా మారిన సంగతి తెలిసిందే.. ఇక, ఇవాళ అనసూయ చేసిన వ్యాఖ్యల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..