మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా పోటీ చేసినట్టు ఎక్కడా అనిపించలేదని, మోహన్ బాబు గారే పోటీ చేశారనే భావన అందరికీ కలిగిందన్న అభిప్రాయాన్ని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలుపొందిన అభ్యర్థులు వ్యక్తం చేశారు. నిజానికి మోహన్ బాబు తమపై చేసిన దౌర్జన్యాన్ని విష్ణు, మనోజ్ ఆపే ప్రయత్నం చేశారని, ఒక వేళ అక్కడ మంచు మనోజ్ లేకపోయి, తమని వారించి ఉండకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండేవని సమీర్ అన్నాడు. పాతికేళ్ళుగా విష్ణుతో తనకు పరిచయం ఉందని, ఓ తమ్ముడిలా అతన్ని ట్రీట్ చేస్తానని అయినా ఒకానొక సమయంలో తనపై మాట జారాడని, తాను మాత్రం వెనక్కి తగ్గకుండా అలానే నిలబడ్డానని చెప్పాడు. మంచు మనోజ్ ఎంతో విజ్ఞతతో వ్యవహరించి, తన పర బేధం లేకుండా వ్యవహరించాడని అతను అక్కడ ఉండకపోయి వుంటే పెద్ద యుద్ధమే జరిగి ఉండేదని సమీర్ అన్నాడు.