ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. ఇక్కడ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి తల్లిగారింటికి వచ్చి.. అత్తమామల ఇంటికి వెళ్లకుండా, తమ పిల్లలను తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. ఇప్పుడు వారిద్దరూ మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. తమ లవర్స్ను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ తిరిగి రావడానికి నిరాకరించారు.
Viral Video: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ యువకుడికి తాలిబాన్ తరహా శిక్ష విధించారు. అమ్రోహా జిల్లాలో ఈ అవమానకరమైన ఘటన జరిగింది. యువకుడి మొహానికి నల్లరంగు పూసి, సగం గుండు కొరిగించి, మెడలో చెప్పు దండ వేసి ఊరేగించారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు ఒక వింత సమస్య ఎదురైంది. 25 ఏళ్ల యువతి ప్రేమ వారికి తలనొప్పిగా మారింది. అయితే, సదరు యువతి తన కన్నా చిన్నవాడైన 16 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడింది.
Love Affair: లివింగ్ రిలేషన్స్, వివాహేతర సంబంధాలు హత్యలకు కారణమవుతున్నాయి. చాలుమాటు సంబంధాలు నేరాలతో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లై ఆరుగురు పిల్లలు ఉన్న వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే 10 సార్లు గొంతు కోసి హతమార్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న సమయంలో మృతురాలు రక్తపుమడుగులో పడి ఉంది. పక్కనే నిందితుడు కూడా ఉన్నాడు.
Mumbai Court: విడిపోయిన తర్వాత మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుంటే అది బెదిరింపు కేసుగా మారదని ముంబై కోర్టు కీలక తీర్పు చెప్పింది. మాజీ ప్రియుడి మరణానికి ప్రేరేపించిందనే ఆరోపణలలో ఒక మహిళను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. ఒకరి ఇష్టాయిష్టాలకు, అభిరుచుల ప్రకారం పార్ట్‌నర్లను మార్చడం "నైతికం"గా సరికాదు, కానీ రిలేషన్‌షిప్‌లో తిరస్కరణ ఎదుర్కొన్న వ్యక్తికి శిక్షా చట్టం ప్రకారం ఎలాంటి పరిహారం లేదని కోర్టు పేర్కొంది.
Kerala: కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కగానొక్క కూతురు తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేరళలోని కొల్లాంలో చోటు చేసుకుంది. కొల్లాం పావుంబకు చెందిన ఉన్నికృష్ణ పిళ్లై(52), ఆయన భార్య బిందు(48) బలవన్మరణాకి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లక్నోలో దారుణం జరిగింది. ప్రియురాలిని హత్య చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాకోరికి చెందిన బ్రిజేష్ మౌర్యను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అతని ప్రియురాలు సరిత, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసినందుకే నిందితుడు గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువు వద్ద వేలాడదీశాడు.
Bombay High Court: 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలికపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టైన మహారాష్ట్ర వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లైంగిక సంబంధం ప్రేమ వ్యవహారంతో జరిగిందని, అది కామం వల్ల కాదని కోర్టు అభిప్రాయపడింది. బాలిక మైనర్ అని.. అయితే ఆమె తన ఇష్టంతోనే ఇంటిని వదిలేసి నిందితుడు నితిన్ ధబేరావ్‌తో కలిసి వెళ్లిందని, ఈ విషయాన్ని పోలీసులకు కూడా…
ఇటీవల కాలంలో ప్రేమ వ్యవహారాల్లో పరువు హత్యలు జరుగుతున్నాయి. తమ కంటే తక్కువ కులం వాడిని ప్రేమిస్తుందని, తన మాట వినడం లేదని తల్లిదండ్రులు కూతుర్లను చంపేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కుమర్తె ప్రేమ వ్యవహారంతో తండ్రి ఆమెను, ఆమె లవర్‌ని ఘోరంగా హత్య చేశాడు.
Honour killing: మరో పరువు హత్యకు 20 ఏళ్ల యువతి బలైంది. కులాంత సంబంధం పెట్టుకుందని 20 ఏళ్ల కూతురిని తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈఘటన కర్ణాటకలోని దేవనహళ్లీ తాలూకాలోని బిదలూర్ గ్రామంలో బుధవారం జరిగింది. దళిత వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందకు కూతురుని హత్య చేశాడు. తక్కువ కులానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దని హెచ్చరించినప్పటికీ, మారకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు.