Viral Video: లవ్ ఎఫైర్.. యువకుడికి సగం గుండు, చెప్పుల దండతో ఊరేగింపు..
- యువకుడికి తాలిబాన్ తరహా శిక్ష..
- సగం గుండు
- చెప్పుల దండతో ఊరేగింపు..
- యువతితో లవ్ ఎఫైర్‌పై పంచాయతీ తీర్పు..
- ఉత్తర్ ప్రదేశ్ అమ్రోహాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ యువకుడికి తాలిబాన్ తరహా శిక్ష విధించారు. అమ్రోహా జిల్లాలో ఈ అవమానకరమైన ఘటన జరిగింది. యువకుడి మొహానికి నల్లరంగు పూసి, సగం గుండు కొరిగించి, మెడలో చెప్పు దండ వేసి ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ అబ్బాయి చేసిన పని ఏంటంటే, ఆ గ్రామంలోని ఒక అమ్మాయిని ప్రేమించడమే. ఈ వ్యవహారంలో యువకుడికి అత్యంత దారుణమైన శిక్ష విధించారు.
అమ్రోహ్ జిల్లా నౌగావాన్‌లోని ఖేడా అప్రోలా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పంచాయతీ ఈ శిక్షను విధించి, అమలు చేసింది. గ్రామంలోని ఓ బాలికతో యువకుడు మాట్లాడుతుండగా, తమ కూతురితో మాట్లాడినందుకు యువతి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం పంచాయతీకి చేరింది. పంచాయతీ వారు యువకుడికి కఠిన శిక్ష విధించారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
Read Also: Deputy CM Pawan Kalyan: గ్రామీణ రహదారుల నిర్మాణంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. యువకుడిని గ్రామంలోని అన్ని వీధుల గుండా ఊరేగిస్తుంటే, పిల్లలు అతడిని ఎగతాళి చేయడం వీడియోలో కనిపించింది. యువకుడి తన సగం షేవ్ చేయబడింది, అతని ముఖానికి సిరా నల్లగా చేశారు, మెడలో చెప్పుల దండ కూడా కనిపిస్తుంది. యువతి కుటుంబీకులు అతడిని దారుణంగా కొట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. దీనిపై ఫిర్యాదు నమోదు చేసి, విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేశామని, ఒకే వర్గానకి చెందిన ఇద్దరు ఇరుగుపొరుగు వారి మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. వీడియో గురువారం మధ్యాహ్నం ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
अमरोहा :पंचायत ने प्रेमी का मुंह काला कर गले में चप्पलों की माला डाल कर गांव में घुमाया
प्रेमी से बात करने पर नाराज थे प्रेमिका के परिजन
गले में चप्पलों की माला मुंह काला कर घुमाया
प्रेमी को सुनाया तुगलकी फरमान
नौगांवा के खेड़ा अप्रोला गांव का मामला@amrohapolice @Uppolice pic.twitter.com/cBWLy4mxlu
— News1India (@News1IndiaTweet) July 11, 2024
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!