Interfaith marriage: జార్ఖండ్‌కి చెందిన ముస్లిం యువకుడు, హిందూ అమ్మాయిలకు సొంత రాష్ట్రంలో బెదిరింపులు ఎదురుకావడంతో కేరళ వీరి అండగా నిలిచింది. జార్ఖండ్‌కి చెందిన మహ్మద్ గాలిబ్, ఆశా వర్మలు ప్రేమించుకున్నారు. వీరిద్దరి మతాలు వేరు కావడంతో వారి కుటుంబాల నుంచి పొరుగువారి నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ‘‘లవ్ జిహాద్’’కి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బెదిరింపులు ఎక్కువ అయ్యాయి.
Bengaluru: తాను ప్రేమించిన అమ్మాయి దూరమైందనే కోపంతో ఓ వ్యక్తి ఏకంగా సదరు అమ్మాయి తండ్రి ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన దక్షిణ బెంగళూర్‌లో జరిగింది. మొత్తం మూడు కార్లను తగులబెట్టడంతో పాటు ఒక బైక్‌ని ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మూడు కార్లలో రెండు అమ్మాయి తల్లిదండ్రులవి కాగా, బైక్ ఆమె సోదరుడిది. నిందితుడు లక్ష్యంగా చేసుకున్న రెండు కార్ల పక్కన మరో కారు ఉండటంతో అది కూడా తగలబడింది.…
SangaReddy: సంగారెడ్డి జిలా నిజాంపేట మండలం ఈదులతండా శివారులో ఘోరమైన హత్య ఘటన చోటుచేసుకుంది. కూతురిని ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ తండ్రి యువకుడిని పాశవికంగా హత్య చేసి అతని శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిన ఘటన చోటు చేసుకుంది. నిజాంపేట మండలానికి చెందిన దశరథ్ (26) హత్యకు గురైన బాధితుడు. అతను నిందితుడు గోపాల్ కుమార్తెతో సన్నిహితంగా ఉండటాన్ని గోపాల్ సహించలేకపోయాడు. దీంతో అతనిపై కోపంతో దాడి చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అటవీ…
Love Affair: ఓ జంట ప్రేమ వ్యవహారం విషాదంగా మారింది. పెళ్లికి ఒక రోజు ముందు 18 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లా ఈ ఘటన జరిగింది. షైమా సినివర్ అనే యువతి తన పొరుగింటిలో ఉండే 19 ఏళ్ల సజీర్‌తో ప్రేమలో ఉంది. అయితే, ఆమె కుటుంబం మాత్రం వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. వివాహానికి వారం ముందే ఎంగేజ్మెంట్ జరిగింది. దీంతో మనస్తాపానానికి గురైన యువతి తన మామ ఇంటిలో…
Shocking: తమిళనాడు తంజావూర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ప్రభుత్వ మహిళాకళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ఆడశిశువుకు జన్మనిచ్చింది. పురిటినొప్పులు రావడంతో టాయిలెట్‌కి వెళ్లిన విద్యార్థిని బిడ్డను ప్రసవించింది. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండేందుకు బిడ్డను చెత్తబుట్టలో పారేసింది. యూట్యూబ్‌లో చూస్తే బొడ్డు పేగుని కోసి పాపను చెత్తకుండిలో విసిరేసి క్లాస్ రూంకి తిరిగి వచ్చింది.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోసి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సింధనూర్‌లో జరిగింది. పట్టపగలే ఈ దారుణం జరిగింది, నేరం చేసిన తర్వాత నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. మరణించిన విద్యార్థిని షిఫా(24)గా గుర్తించారు. నిందితుడు టైల్స్ దుకాణంలో పనిచేసే ముబిన్‌గా గుర్తించారు.
Supreme Court: కొడుకు ప్రేమ వ్యవహారాన్ని తల్లి ఒప్పుకోకపోవడం అనేది, అతడిని ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్యను ప్రేరేపించినట్లు కాదని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. తన ప్రేమికుడిని వివాహం చేసుకోకుండా జీవించలేదని, ఆత్మహత్యకు పాల్పడటం, సదరు అమ్మాయిన ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని సుప్రీకోర్టు స్పష్టం చేసింది.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలనగర్ లో ప్రేమ వ్యవహారం, పసి పాపకు శాపంగా మారింది. గోపాల నగర్ లో నివాసం ఉంటున్న ప్రదీప్, అదే ప్రాంతానికి చెందిన యువతి స్వాతి ప్రేమ పేరుతో తరచూ వేధించేవాడు. పలు మార్లు యువతి బంధువులు హెచ్చరించారు. ప్రదీప్ తన శైలి లో మార్పు రాకపోగా.. స్వాతికి, పువ్వులు పంపడంతో స్వాతి బాబాయ్ వివేక్‌నంద ఆగ్రహానికి గురయ్యారు.
Woman flees with lover: ప్రస్తుత కాలంలో వివాహ వ్యవస్థకు గౌరవం లేకుండా పోతోంది. క్షణకాలం సుఖం కోసం చాలా కాపురాలు కూలిపోతున్నాయి. పిల్లలను, భర్తను వదిలేసి కొందరు మహిళలు ప్రియుడితో పారిపోతున్నారు. మరికొందరు ప్రియుడి సాయంతో భర్తను అడ్డుతొలగించుకునేందుకు హత్యలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా నేరాలు ఎక్కువ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా పరిచమైన వ్యక్తులతో స్నేహం, ప్రేమగా మారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Shocking News: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రేమ జంటను యువతి కుటుంబీకులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన యూపీలోని లలిత్పూర్ జిల్లాలో న్యూ ఇయర్ రోజు జరిగింది. 22 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల యువతిని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారని, ఆ తర్వాత హత్యలను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని సోమవారం పోలీసులు తెలిపారు. యువతి తండ్రి, తల్లి, మామలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.