లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడుల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. భారతీయ దౌత్య సంస్థల భద్రత సమస్యపై చర్చించారు. భారతదేశ వ్యతిరేక అంశాలకు వ్యతిరేకంగా బలమైన చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు.
లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ప్రయాణీకుడి తీవ్రమైన వికృత ప్రవర్తన కారణంగా సోమవారం ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఢిల్లీ-లండన్-హీత్రూ మార్గంలో పనిచేయాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 111 బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగి వచ్చింది.
Indian journalist attacked Khalistani supporters: ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత తొమ్మిదిరోజులుగా అతను తన రూపాన్ని మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇంత జరిగిన పంజాబ్ ప్రశాంతంగా ఉంది. అయితే విదేశాల్లో ఉంటున్న రాడికల్ ఎలిమెంట్స్, ఖలిస్తానీ మద్దతుదారులు భారత రాయబార కార్యాలయాల ముందు ఆందోళన చేస్తున్నారు. ఈ వారం యూకే లండన్ లోని భారత హైకమిషన్ పై దాడి చేశారు.
Indian Mission In UK: యూకేలోని భారత హైకమిషన్ పై ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి దాడికి యత్నించారు. దీంతో పోలీసులు హైకమిషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఖలిస్తాన్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ అణిచివేతకు వ్యతిరేకంగా బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి భారత రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేశారు.
UK: విదేశాల్లో ఉంటున్న ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో భారత వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గత రెండు రోజులుగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతని అనుచరులు, బాడీగార్డులను కలిపి 78 మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీసుకుంటున్న ఈ చర్యలపై విదేశాల్లో కూర్చుని ఉన్న ఖలిస్తానీ మద్దతుదారులకు నచ్చడం లేదు.
లండన్ లో ఖలిస్థాన్ అనుకూలవాదులు భారత హై కమిషన్ బిల్డింగ్ పై ఉన్న జాతీయ జెండాను కిందికి దించారు. అలా జెండాను అగౌర పరచడంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
డ్లపై డబుల్ డెక్కర్ బస్సులు ఎంతో ఫేమస్. ఈ బస్సుల్లో ప్రయాణాన్ని ఇష్టపడడమే కాకుండా.. వీటిని చూసేందుకు కూడా జనాలు అమితాసక్తిని కనబరిచేవారు. ప్రయాణికులు ప్రత్యేక అనుభూతిని ఆస్వాదించేవారు. డబుల్ డెక్కర్ మధురస్మృతులు పొందతారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌లో ప్రజాస్వామ్యం, పార్లమెంట్ పనితీరుపై బ్రిటన్ ఎంపీలు ఆయనను ప్రశ్నించారు. వీటికి సమాధానంగా భారత్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Rahul Gandhi: కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ యూకేలో పర్యటిస్తున్నారు. ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇదిలా ఉంటే లండన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మరోసారి భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీని గుడ్డిగా విశ్వసించే ఎవరికైనా మద్దతు ఉంటుందని, మోదీపై, ప్రభుత్వంపై ప్రశ్నలు లేవనెత్తే వారిపై దాడులు జరుగుతున్నాయని, బీబీసీపై ఇదే విధంగా దాడి జరిగిందని ఆయన అన్నారు.
Bengaluru world’s second-most traffic congested city: ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక రద్దీ ఉన్న నగరాల జాబితాలో బెంగళూర్ చోటు సంపాదించుకుంది. లండన్ తర్వాత ప్రపంచంలో రెండో అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరంగా బెంగళూర్ నిలిచింది. టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రపంచంలోని అత్యధిక రద్దీ ఉన్న నగరాలకు ర్యాంకింగ్స్ కేటాయించింది. భారత్ నుంచి బెంగళూర్ రెండో స్థానంలో నిలవగా.. పూణే 6వ స్థానంలో, న్యూఢిల్లీ 34వ స్థానంలో, ముంబై 47వ స్థానంలో ఉన్నాయి