వచ్చే ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు.
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.. భారతదేశంలో మహేష్ కు ఫ్యాన్స్ ఉన్నారు.. తెలుగు టు హిందీ ప్రజలు ఆయన అందానికి ఫిదా అవుతున్నారు.. ఇక అమ్మాయిల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయానే చెప్తారు.. మహేష్ అంత హ్యాండ్సమ్ గా ఉంటాడు..ప్రస్తుతం ఆయన వయస్సు 48 అయినా.. 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ యంగ్ హీరోలకు సైతం కుళ్లుకోవాల్సిందే అనేట్టుగా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నారు.. భారీ…
Hyderabad Man Rayees Uddin stabbed to death in London: లండన్‌లో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఖాజా రైసుద్దీన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. 65 ఏళ్ల రైసుద్దీన్.. వెస్ట్ యార్క్‌షైర్‌లోని హిల్ టాప్ మౌంట్ ప్రాంతంలో చంపబడ్డాడు. దుండగులు కత్తితో పొడిచి అతడిని దారుణంగా చంపేశారు. అనంతరం రైసుద్దీన్ వద్ద ఉన్న నగదును దుండగులు దోచుకున్నారని సమాచారం తెలుస్తోంది. రైసుద్దీన్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు లండన్‌లోని భారత హైకమిషన్ ప్రయత్నాలు…
TomTom Traffic Index :ట్రాఫిక్ జామ్ ఈ పేరు వింటేనే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలన్నా సొంత వాహనాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. లేదంటే అద్దెకు అయినా వాహనాలను తీసుకుంటున్నారు. దీంతో నగరాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కొన్ని కొన్ని సార్లు ఈ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవడం కంటే నడిచి వెళ్లిపోతేనే త్వరగా వెళ్లిపోతాం అనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రపంచం నగరాల్లోని ట్రాఫిక్ జామ్ లపై ‘టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2022’ …
Rishi Sunak : భారత సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. బ్రిటన్ పార్లమెంట్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా తేలింది. సునాక్ భార్య అక్షత మూర్తికి పలు చైల్డ్ కేర్ కంపెనీలలో షేర్లు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని సునాక్ వెల్లడించలేదు. దీంతో తన భార్యకు ఉన్న షేర్ల విషయం చెప్పకుండా రిషి సునాక్ పార్లమెంటరీ నిబంధనలు ఉల్లంఘించారని విపక్షలు ఆరోపించాయి. ఈ చైల్డ్ కేర్ పథకాలతో అక్షత మూర్తి లబ్ధి పొందుతున్నారని కూడా ఆరోపణలు చేశారు. అయితే…
రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు. మాస్ మహారాజా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు తో సినిమాతో పాటు ఈగల్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.కొన్ని రోజులుగా టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ తన అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు.1970 కాలంలో స్టూవర్ట్‌పురం లో పాపులర్ దొంగగా పేరు పొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యం లో వస్తోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ వంశీ…
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశమంతట సంబరాలు అంబరానంటాయి. అంతేకాకండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ తాము ఉన్న చోట స్వాతంత్ర్య దినోత్స వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక ఒక చోట మాత్రం చిరకాల ప్రత్యర్థులుగా భావించే భారత్, పాక్ పౌరులు కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ అరుదైన సంఘటన బ్రిటన్ లోని లండన్ లో జరిగింది. భారతదేశం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటే పాకిస్తాన్ మనకంటే ఒకరోజు ముందే అంటే…
యువ రైతులు చేస్తున్న వ్యవసాయానికి మంత్రి నిరంజన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవసాయమే ప్రపంచానికి దిక్సూచి.. వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈ ప్రపంచం సురక్షితంగా ఉంటుంది అని అన్నారు. పంట సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలి.. మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలి అని ఆయన పేర్కొన్నారు.