700 మంది రైతులు అమరులైనా డేటా లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంటూ దేశ రాజధాని శివార్లలో రైతు సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి.. కేంద్రం ఆ వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకున్నా.. మరికొన్ని డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. చలి, ఎండ, వాన ఇలా ఏదీ లెక్కచేయకుండా ఆందోళన చేసిన రైతులు చాలా మంది వివిధ కారణాలతో ప్రాణాలు వదిలారు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కన్నుమూశారు.. అయితే, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి స్పందిస్తూ.. రైతులు మృతిచెందారా? మాకు తెలియదే? అంటూ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై లోక్‌సభలో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. కిసాన్ ఆందోళనలో 700 మంది రైతులు అమరులయ్యారు.. దేశ రైతుల నుంచి ప్రధాని క్షమాపణలు కూడా కోరారు, కానీ, ఆ అమర రైతుల డేటా ప్రభుత్వం దగ్గర లేదా? అంటూ మండిపడ్డారు.
Read Also: సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు.. ఆ తర్వాత రాజకీయాల్లో ఉండను..!
Also Read
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
ఇక, కొత్త వ్యవసాయ చట్టాలతో తప్పు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పుకున్నారని, కానీ, వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం ప్రాణాలు కోల్పోయిన రైతుల సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.. నవంబర్ 30వ తేదీన వ్యవసాయ మంత్రిని ప్రశ్నించగా.. తమ వద్ద మరణించిన రైతుల డేటా లేదని చెప్పినట్లు రాహుల్ గుర్తుచేశారు.. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు పంజాబ్ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందన్న రాహుల్.. తన దగ్గర ఆ లిస్టు ఉందని, దాన్ని హౌజ్‌లో పెట్టామన్నారు. హర్యానాలోనూ అమర రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చిన లిస్టు కూడా సభలో పెట్టామన్నారు. ఇలాంటి సందర్భంలో రైతులు ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం ఎలా చెబుతుందని నిలదీసిన ఆయన.. క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ.. రైతులకు పరిహారం కూడా అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కాగా, కిసాన్ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్‌ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!