పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. జూలై 22న వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మోడీ 3.0 ప్రభుత్వం జూలై 23న 2024-25 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి.
ఇది కూడా చదవండి: Deputy CM: సుంకిశాల ప్రాజెక్టు విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్..
వాస్తవానికి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా.. మూడు రోజుల ముందే స్పీకర్ ఓం బిర్లా నిరవధిక వాయిదా వేశారు. అలాగే రాజ్యసభ కూడా వాయిదా పడింది. ఆర్థిక బిల్లు మాత్రం ఆమోదం పొందింది. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ చట్టాన్ని సవరించే బిల్లు కూడా ప్రవేశపెట్టబడింది. నిబంధనలపై నిరసనలు వ్యక్తం కావడంతో పార్లమెంటు సంయుక్త కమిటీకి సిఫార్సు చేశారు.
ఇది కూడా చదవండి: Hit and run: మహారాష్ట్రలో మరో హిట్ అండ్ రన్ కేసు.. కారు ఢీకొని యువకుడి మృతి