దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ సార్వత్రిక ఎన్నికలలో 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగారు. వీరిలో 252 మంది అభ్యర్థులు నేరచరితులు అంటే వారిపై క్రిమినల్ కేసు నమోదైంది.
జూన్ 8 లేదా 9న మూడో సారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దేశం కోసం ఓటెయ్యండి.. అభివృద్ధి కోసం ఓటెయ్యండి అంటూ ప్రజలకు ఆయన సూచించారు. భారత దేశ గౌరవాన్ని పెంచడం కోసం ఓటెయ్యాలన్నారు. మోడీ ప్రధాని అయ్యేవరకు దేశం ఎలా ఉండేది.? ఆలోచించాలన్నారు.
Eknath Shinde: శివసేన పార్టీలో చీలిక తీసుకురావడంపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. బాలా సాహెబ్ థాకరే( ఉద్ధవ్ ఠాక్రే తండ్రి) మమ్మల్ని స్నేహితులుగా భావించేవారు, కానీ ఉద్ధవ్ ఠాక్రే మాత్రం మమ్మల్ని ‘‘ఇంటి సహాయకులు’’గా
Kangana Ranaut: బీజేపీ లోక్‌సభ అభ్యర్థి, హిమాచల్ ప్రదేశ్ మండి నుంచి పోటీ చేస్తున్న కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేత వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఆమె గొడ్డుమాంసం(బీఫ్) తింటుందని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్ని ఆమె తోసిపుచ్చారు. తాను హిందువుగా గర్విస్తున్నానని అన్నారు.
‘విజయమే లక్ష్యంగా 26 డివిజన్లలోనూ టిడిపి కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయాలి. పనిచేయకుండా ఫలితం ఎవరికీ దక్కదు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత మాది.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ కన్నేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ 'అబ్ కీ బార్ 400 పార్' నినాదాన్ని ఇచ్చింది.
Annamalai: తమిళనాడులో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. అధికార డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కోయంబత్తూర్‌లో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇవ్వడంపై
Tejashwi Yadav: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితిష్ కుమార్ ప్రధాని మోడీ పాదాలను తాకడం ఆ రాష్ట్రంలో రాజకీయంగా ప్రతిపక్షాలకు విమర్శణాస్త్రంగా మారింది.