Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గురువారం మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, ఓ ప్రచార సభలో మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్ 370ని మార్చడానికి ధైర్యం చేయవద్దు’’ అని కాంగ్రెస్‌ని హెచ్చరించారు.
Tamil Nadu: లోక్‌సభ పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో తమిళనాడులో అధికార డీఎంకే వర్సెస్ బీజేపీలా రాజకీయం నడుస్తోంది. ఇరు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
Mamata Banerjee: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి), యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ని పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయబోమని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వ హయాంలో మన దేశ భద్రతాబలగాలు ఉగ్రవాదుల్ని వాళ్ల సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని గురువారం అన్నారు.
రాష్ట్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించే యువతకు కొప్పుల ఈశ్వర్ ప్రస్థానం కచ్చితంగా స్ఫూర్తిదాయకమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి, సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు.