వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాలని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, కవ్వంపెల్లి సత్యనారాయణలు దర్శించుకున్నారు.
ఈ ఎన్నికలు తెలంగాణకో.. సికింద్రాబాద్ కో సంబంధించినవి కావు.. దేశం కోసం జరిగే ఎన్నికలు ఇవి అని సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్ పైన గల్లీ టూ గల్లీ కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.
కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి డ్రాయర్ ఊడదీస్తా అంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు సీఎంవా చెడ్డి గ్యాంగ్ లీడర్‌వా రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కొట్లాడి 1000 కోట్ల నిధులు తెచ్చానని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
అమేథీ లోక్‌సభ టికెట్‌పై కాంగ్రెస్‌లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు ఈ టికెట్‌పై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకులేదు. దీంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా, డీప్‌ఫేక్‌లు, తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది. తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో తప్పుడు సమాచారాన్ని అడ్డుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు ఇందుకు సిద్ధమయ్యాయి. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో.. యూట్యూబ్ గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ప్లాట్‌ఫారమ్ నుండి 2.25 మిలియన్ వీడియోలను తొలగించినట్లు తెలిపింది.
దేశంలో మొదటి, రెండో దశ సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే దేశంలోని రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల అభ్యర్థిత్వంపై కొన్ని ముఖ్యమైన స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ఇప్పటి వరకు 418 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 92 మంది సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లను పార్టీ రద్దు చేసింది.