Annamalai: తమిళనాడులో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. అధికార డీఎంకే, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కోయంబత్తూర్‌లో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విరుచుకుపడ్దారు. ఇది ఎన్నికల స్టంట్ అని అభివర్ణించారు. కొత్త హామీలను ఇచ్చే ముందు గతంలో ప్రకటించిన 511 ఎన్నికల హామీలను తప్పనిసరిగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కోయంబత్తూర్‌లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు డీఎంకే ఇలాంటి వాగ్దానాలు చేస్తుందని ఆయన అన్నారు.
Read Also: Iran: ఇజ్రాయిల్ ఎంబసీలు ఇక ఎంత మాత్రం సేఫ్ కావు.. ఇరాన్ వార్నింగ్..
2021లో స్టాలిన్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, ఓడిపోతున్నామని గ్రహించి మరిన్ని హామీలను చేస్తున్నారని, ముందుగా ఇచ్చిన హామీలను స్టాలిన్‌కి గుర్తు చేయాలని అనుకుంటున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కోయంబత్తూర్ యువత, క్రీడా ప్రియులు మరింత అప్రమత్తంగా ఉన్నందున డీఎంకే హామీలు పనిచేయవని అన్నామలై అన్నారు. తాము గెలిస్తే కోయంబత్తూర్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని స్టాలిన్ ఇటీవల ప్రకటించారు.
ఈసారి ఎలాగైనా, తమిళనాడులో బీజేపీ సత్తా చాటాలని అనుకుంటోంది. అన్నామలైని కోయంబత్తూర్ నుంచి లోక్‌సభ బరిలో నిలిపింది. మరోవైపు డీఎంకేకి కోయంబత్తూర్ ఎంపీ స్థానంలో సరైన ట్రాక్ రికార్డ్ లేదు. దీంతో డీఎంకే పార్టీ అన్నామలై ఓడించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కోయంబత్తూర్ నుంచి డీఎంకే గణపతి పి కుమార్‌ని బరిలోకి దించింది. ఏఐడీఎంకే సింగై రామచంద్రన్‌ని పోటీలో నిలిపింది. తమిళనాడులోని 39 స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 23 ఎంపీ స్థానాలను డీఎంకే గెలుచుకోగా.. మిత్రపక్షాలైన కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకోగా.. సీపీఐ రెండు, సీపీఎం, ఐయూఎంఎల్‌లు ఒక్కో స్థానాన్ని దక్కించుకోగా.. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు.
We want to remind TN CM Thiru @mkstalin that the 511 poll promises he gave in 2021 remain unfulfilled, and he first attends to those before making further promises after sensing defeat.
The electoral stunts of DMK cannot deceive the youth & the sports enthusiasts in Coimbatore… https://t.co/8Qpr0fVzmz
— K.Annamalai (மோடியின் குடும்பம்) (@annamalai_k) April 7, 2024