సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియాలో రకరకాలైన విశ్లేషణలు వస్తుంటాయి. ఒక్కొక్కరు ఒక్కో పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుంటారు. అయితే కొన్ని విశ్లేషణలు ఆయా పార్టీలకు నచ్చవు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంటాయి. తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనపై తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం అగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబ్‌లో విమర్శలు చేసే ప్రతీ వ్యక్తినీ అరెస్టు చేసుకుంటూ పోతే.. ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో పెడతారు? అంటూ స్టాలిన్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. సోషల్ మీడియాలో విమర్శలు చేసే ప్రతి ఒక్కరినీ జైలుకు పంపడం సరికాదని జస్టిస్‌లు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: Jogi Ramesh: చంద్రబాబు, పవన్ ఇద్దరు కలిసినా గెలవలేరు.. అందుకే బీజేపీతో దోస్తీ చేస్తున్నారు..
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తమిళనాడుకు చెందిన యూట్యూబర్ దురై మురుగన్‌ను 2021 అక్టోబరులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడికి బెయిల్ మంజూరైంది. అయితే న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడన్న కారణంతో 2022లో మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ అతడి బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో మురుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్ లభించింది. అప్పటి నుంచి అతడు బయటే ఉంటున్నాడు.
ఇది కూడా చదవండి: Pamidi Samanthakamani: వైసీపీకి మరో షాక్.. పార్టీకి మాజీ మంత్రి రాజీనామా
ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ రద్దును సవాల్ చేస్తూ యూట్యూబర్ దురై మురుగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. యూట్యూబ్‌లో విమర్శలు చేసిన ప్రతిఒక్కరినీ అరెస్టు చేసుకుంటూపోతే.. ఎన్నికల ముందు ఎంతమందిని జైల్లో పెడతారు? అని ప్రశ్నించింది. కోర్టు ఇచ్చిన స్వేచ్ఛను అతడు దుర్వినియోగం చేసినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొంది. దీంతో అతడి రెగ్యులర్ బెయిల్‌ను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
ఇది కూడా చదవండి: Hafiz Saeed: ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయాద్‌పై విష ప్రయోగం.. సోషల్ మీడియాలో దుమారం..
సార్వత్రిక ఎన్నికల ముందు సోషల్ మీడియాలో కామెంట్లు చేసేవారికి ఈ తీర్పు ఓ బూస్ట్‌లాంటింది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఆయా పార్టీలకు అనుకూలంగా యూట్యూబర్లు వీడియోలు పెడుతున్నారు. రోజు కొన్ని వందల వీడియోల్లో అప్‌లోడ్ అవుతున్నాయి. చాలా మట్టుకు ఆయా పార్టీలకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇక తాజా తీర్పు యూట్యూబర్లకు మాత్రం సానుకూలమైన జడ్జిమెంట్ వచ్చింది. ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతోంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇక విజయంపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Allu Arjun – Trivikram : అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా కన్ఫార్మ్.. పోస్టర్ లుక్ అదిరిందిగా..