Congress: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరిగాయి. సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే పలువురు కీలక నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.
చేవెళ్ళ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర చేయూతనిచ్చినట్టు కనిపిస్తోంది. శనివారం రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహించిన తుక్కుగూడ బహిరంగ సభ కిక్కిరిసిపోయింది. కాంగ్రెస్ శ్రేణులంతా కదం తొక్కారు. పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా తరలిరాగా... చేవెళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి కార్యక్రమ నిర్వహణలో అంతా తానై వ్యవహరించారు.
Congress: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘‘ముస్లిం లీగ్’’ భావజాలం ఉందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించిన తరుణంలో ఆయన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. తన కుర్చీని కాపాడుకోవడానికి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.
Prashant Kishor: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు రాకుంటే రాహుల్ గాంధీ తప్పుకోవడం మంచిదని అన్నారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో భారత్ కంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ ఎన్నికలకు సరిపోతుందని శనివారం ఆరోపించారు.
చేతకాక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్షించారు. తన పార్టీ ప్రభుత్వం ఏమీ చేసిందో తెలియని పరిస్థితిలో రాహుల్ గాంధీ ఉన్నారన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా అబద్ధాలు చెబుతున్నారని.. దమ్ము, ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ గ్యారెంటీల అమలుపై చర్చకు సిద్దమా అంటూ బహిరంగంగా సవాల్ చేశారు.
Rajnath Singh: క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని అయితే, భారత రాజకీయాల్లో ‘‘బెస్ట్ ఫినిషర్’’ రాహుల్ గాంధీ అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు వేశారు.
జాతీయ మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద విడుదల చేయడం సంతోషమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ను ఓడించిన ఉత్సాహంతోనే బీజేపీని ఓడించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని రేవంత్ తెలిపారు.