Annamalai: తమిళనాడులో పొలిటికల్ హీట్ పీక్స్‌కి చేరింది. అధికార డీఎంకే, బీజేపీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై అధికార డీఎంకేపై విరుచుకుపడ్డారు. డీఎంకే పార్టీని ‘దుష్టశక్తి’గా అభివర్ణించారు.
‘ఎవరైనా సరే ఒక వ్యక్తికి నమస్కారం పెట్టే స్థాయి నుంచి, మరో 10 మందికి స్ఫూర్తిగా ఎదిగే స్తాయికి ఎదగాలి. ప్రభుత్వం అనేది సంక్షేమం అందజేసి చేతులు దులుపుకోకూడదు, స్వయంగా సంపాదించుకునేలా ఉపాధి అవకాశం కల్పించాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
కడియం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ అధిష్ఠానం.. ఆయనకు ఎలాగైన బుద్ధి చెప్పాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం నిలబడితే.. ఆయనకు పోటీగా తాటికొండ రాజయ్యను బరిలో దింపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
దేశానికి సంబంధించిన ఎన్నికలు వచ్చేనెల జరగనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవి దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలని ఆయన వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా సందర్భంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గ్రామాల్లో ఉన్న ముసలి వారు కూడా మోడీకే ఓటు వేస్తాం అంటుంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. వ్యవసాయ అధికారులు వడ్లు కొనడం లేదని ఎంపీ బండి సంజయ్‌కి రైతులు మొరపెట్టుకున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Rajnath Singh: కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విధించిన ‘ఎమర్జె్న్సీ’పై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.