దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. వచ్చే వారమే తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే ఫస్ట్ ఫేజ్‌లో ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారు. అభ్యర్థులు ఎన్నికల అధికారికి అఫిడవిట్లు సమర్పించారు. అయితే అత్యంత ధనవంతులతో కూడిన 10 మంది జాబితాను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసింది. తొలి విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తనయుడు నకుల్‌నాథ్ మొదటి స్థానంలో నిలిచారు.
అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణ ప్రకారం మధ్యప్రదేశ్‌లోని చింద్వారా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్‌కు రూ.717 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానంలో తమిళనాడులోని ఈరోడ్ నుంచి పోటీ చేస్తున్న ఏఐఏడీఎంకే నేత అశోక్ కుమార్ రూ.662 కోట్లతో సెకండ్ స్థానంలో నిలిచారు. ఇక మూడో స్థానంలో తమిళనాడులో శివగంగ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న దేవనాథన్ యాదవ్ రూ.304 కోట్లు ఉన్నట్లుగా అఫిడవిట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Cruel Mother: ప్రియుడి మోజులో పడి.. కన్న పిల్లలను చంపేసిన కసాయి తల్లి
లోక్‌సభ ఎన్నికలకు ముందు కమల్‌నాథ్ పార్టీ మారతారని పెద్ద ప్రచారమే జరిగింది. ఆయన బీజేపీలోకి వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన పరాజయం తర్వాత ఇలాంటి వార్తలు వినిపించాయి. ఇక ఇందిరాగాంధీతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కమల్‌నాథ్‌ను తన మూడో కుమారుడు అని ఇందిరా ఉదహరించేవారు. మొత్తానికి ఆయన పార్టీ మారలేదు. పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. అలాగే కుమారుడి సీటు విషయంలో కూడా ఇలాంటి గందరగోళమే జరిగింది. కానీ చింద్వారా లోక్‌సభ సీటు నకుల్‌నాథ్‌కే లభించింది.
ఇది కూడా చదవండి: RT75 : అలాంటి పాత్రలో కనిపించబోతున్న రవన్న.. రచ్చ రచ్చే..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభంకానుంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. తొలి విడతలో భాగంగా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక రెండు విడత నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది.