రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు తమ కార్యాచరణ ప్రారంభించాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాల అమలును ప్రజలకు వివరిస్తూ ఓట్లు అర్జిస్తోంది.
కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ రాత్రి బాగా నిద్రపోవడానికి 'ఒక పెగ్' తీసుకోవాలని కర్ణాటక బీజేపీ నేత సంజయ్ పాటిల్ సూచించి వివాదం రేకెత్తించారు.
PM Modi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరోసారి ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. ఒకే స్ట్రోక్‌తో దేశంతో పేదరికాన్ని నిర్మూలిస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం స్పందించిన ప్రధాని మోడీ.. ఆయనను ‘‘రాజ మాంత్రికుడు’’ అని ఎద్దేవా చేశారు.
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్జేడీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్నవారు, బెయిల్‌పై ఉన్నవారు ప్రధాని నరేంద్రమోడీని జైలుకు పంపాలని మాట్లాడుతున్నారని, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసాభారతీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
ఇవాళ ఎంతో మంచి రోజు.. ఉత్తమ మేనిఫెస్టోను తయారు చేసిన రాజ్‌నాథ్ సింగ్‌ను అభినందిస్తున్నాను.. అలాగే, మేనిఫెస్టో కమిటీకి అభినందనలు తెలిజేస్తున్నాను అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘సంకల్ప్ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ప్రధాని మోడీ రిలీజ్ చేశారు.
Asaduddin Owaisi: తమిళనాడులో కొత్త పొత్తు పొడిచింది. హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో అప్నాదళ్(కే)తో పొత్తు కుదుర్చుకున్న మజ్లిస్ పార్టీ, ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తును ప్రకటించింది.
తన కోసం ఈ 30 రోజులు కష్టపడితే.. రానున్న ఐదేండ్లు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, సామాన్య ప్రజల కోసం పని చేస్తానని చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.
Hasnuram Ambedkari: అతను 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినా కూడా మరోసారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన హస్నురామ్ అంబేర్కరీ ఎంపీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు.