ఎల్లుండి నుంచే ఏపీ, తెలంగాణల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో మరింతగా పొలిటికల్ హీట్ పెరగనుంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరుగనుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ…
లోక్‌సభ ఎన్నికలు 2024 నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, విలువైన వస్తువులు భారీగా పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) రికార్డు స్థాయిలో డబ్బును సీజ్ చేసింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు 45 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా రూ.4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర తాయిలాలను ఈసీ స్వాధీనం చేసుకుంది. 2019 ఎన్నికల ప్రచారంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్లతో పోలిస్తే.. ఈసారి 34 శతం…
Priyanka Gandhi Husband Robert Vadra on Amethi: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేయడం దాదాపు ఖాయం అయింది. అమేథీ ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని, సరైన సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటామని రాబర్ట్ వాద్రా అన్నారు. సోమవారం యూపీలోని పవిత్ర నగరమైన బృందావన్‌ని సందర్శించి.. లార్డ్ బాంకే బిహారీని దర్శనం చేసుకున్న అనంతరం రాబర్ట్ వాద్రా ఈ వ్యాఖ్యలు…
ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి రైతు రుణమాఫీ చేయలేదు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆగస్ట్ 15వ తేదీ లోపు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం అన్నారు. వచ్చే సారి పండించే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యత నాదన్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైనా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. 13 సంవత్సరాలుగా రాయి మీద రాయి పేర్చినట్టుగా కార్యకర్తలు సైనికులాలగా కష్టపడి పార్టీని నిర్మించామని ఆయన తెలిపారు.
PM Modi: తమిళ పార్టీ డీఎంకేతో పాటు దానితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్న డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి కారణమేంటని ప్రశ్నించారు.